ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్.. ఈ పిక్స్ చూశారా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అమ్మడు ఇమ్మాన్ ఇస్మాయిల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్‌గా, యూట్యూబర్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఓవర్ నైట్‌లో స్టార్ బ్యూటీగా మారిపోయింది. ఒక్కసారిగా ఇండియా మొత్తం ఈ భామ వైపే చూస్తున్నారు. ఈ అమ్మడి గురించి google లో తెగ సెర్చింగ్‌లు మొదలెట్టేశారు. ఇంతకీ దీనికి కారణం ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. ఇమాన్వి.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తో నటించే ఛాన్స్‌ను కొట్టేయడమే దీనికి కారణం.

మొదటి సినిమాతోనే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హ‌నురాగవ‌పూడి కాంబోలో నటించే ఛాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించి తాజాగా పూజా కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌తోపాటు.. ఇమాన్ ఇస్మాయిల్ కూడా పాల్గొని సందడి చేసింది. ప్రభాస్ పక్కన పలు ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చిన ఈ అమ్మడిని చూసి నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోయారు. అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. చీరకట్టులో వచ్చిన ఇమ్మ‌నిని చూసి న్యూ ఫెయిర్ ఇన్ టౌన్ అంటూ.. హాష్ ట్యాగ్‌ల‌తో ట్రెండ్ చేస్తున్నారు.

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు ఒక్కసారిగా రిక్వెస్ట్‌లు వరదల పొంగిపోతున్నాయి. ఒక్కసారిగా ఈమెకు ఉన్నట్టుండి స్టార్డం వచ్చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ఓపెన్ చేసి అమ్మడికి సంబంధించిన బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారిన ఈ అమ్మడు గ్లామర్.. లేటెస్ట్ పిక్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. మీరు ఓ లుక్కేసేయండి.