బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాకపోయినా తను నటిస్తున్న మొదటి సినిమా నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ అతిలోకసుందరి శ్రీదేవి నటవరసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి.. మొదటి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అంతే కాదు.. రామ్ చరణ్ నటిస్తున తన 16వ సినిమాలో హీరోయిన్ గాను ఈ అమ్మడుకనిపించనుంది.
తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. ఇక ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ.. హాట్ హాట్ డ్రస్సులతో సోషల్ మీడియాలో షేక్ చేసే జాన్వి కపూర్ కొన్నిసార్లు సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలా తాజాగా ఈ అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. రీసెంట్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో.. జాన్వి చీరకట్టుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. రెడ్ కార్పెట్ పై రెడ్ ఆర్గాన్జా శారీలో మెరిసిన ఈ అమ్మడు.. అందమైన క్రిమ్సన్ చీరలో ఆకట్టుకుంది. ఇక జాన్వీ మొదటి నుంచి ఫ్యాషన్ డ్రెస్సులు కంటే శారీలో కనిపించడమే ఇష్టమట. ఈ విషయంలో తన తల్లి శ్రీదేవిని ఫాలో అవుతూ ఉంటే.. జాన్వి తనకు ఎంతో ఫేవరెట్ డిజైనర్ అయినా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలు కట్టుకోవడానికి ఎంతో ఇష్టపడుతుంది. అయితే ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించిన జాన్వి.. సరోజ రమణి డిజైనర్ సారీ తో ప్రేక్షకులను మెప్పించింది.
ఈ చీర అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఎంబ్రాయిడరీ తో సున్నితమైన హ్యాండ్ వర్క్ తో చేయబడిన ఈ చీర పై స్టోన్ వర్క్‌తో అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో తయారు చేయడం విశేషం. ఇక చీరతో పాటు.. మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఎంతో కాస్ట్లీగా తయారు చేయించుకుంది జాన్వి. రెండిటిపై హ్యాండ్ వర్క్ తో డిజైన్ చేయించిన ఈ అమ్మడు.. డిజైనర్ మయూరి రమణి బ్లౌజ్ గా పిలవబడే జాకెట్‌ను డిజైన్ చేయించింది. దీని కాస్ట్ అక్షరాలా రూ.50వేలు అని తెలుస్తుంది. ఇక ఈ బ్లౌజ్.. బటర్‌ఫ్లై నెట్ ఫ్యాబ్రిక్ తో తయారు చేశారట. ఇక ఈ బ్లౌజ్ కు కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ పెరల్ వర్క్ తో పాటు.. డఫ్కా టెక్నిక్ ని కూడా యూస్ చేసినట్లు సమాచారం. అయితే జాకెట్ కి రూ.50వేలు పెట్టిన ఈ అమ్మడు చీర కోసం ఎంత ఖర్చు పెట్టి ఉంటుందో తెలిస్తే ఒక్కొక్కళ్ళకి ఫీజులు ఎగిరిపోవడం ఖాయం. చీరకట్టులో దేవకన్యల మెరుస్తున్న జాన్వి..శారీ కాస్ట్ లక్షన్నర పైచిలుకు కాస్ట్ ఉంటుందట. ఈ క్రమంలో అమ్మడి సారీ తో పాటు.. కాస్ట్ తెలిసి ఒక్కొక్కళ్ళు నోరెళ్ళబెడుతున్నారు. ఆమె లేడీ ఫ్యాన్స్ అయితే.. జాన్వి డ్రెస్‌ను.. ఆమె టేస్ట్‌ను తెగ పొగిడేస్తున్నారు.