ఇక ఈ టాలీవుడ్ దర్శకుల పని అయిపోయినట్టేనా.. వీళ్ళ సినిమాలు ఆడవా..?

బాహుబలి, ఆర్ఆర్ఆర్‌, పుష్ప, కల్కి ఇలా భారీ రేంజ్ లో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ.. టాలీవుడ్‌ను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకువెళ్తున్నారు మన స్టార్ దర్శకులు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగాను హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ తీస్తున్న సినిమాలు హిట్.. ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వేల కోట్లు కొల్లగొడుతున్నాయి. తాజాగా కొందరు టాలీవుడ్ డైరెక్టర్ చిన్న సినిమాలతోనూ సెన్సేషనల్ హిట్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు పాన్ వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ దక్కించుకుంటున్నారు డైరెక్టర్లు. ఇలా దూసుకువెళ్తుంటే.. మరి కొంతమంది తెలుగు దర్శకులు మాత్రం రొటీన్ పాత ఆవకాయ కథలను తీస్తూ డీల పడుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ డైరెక్టర్స్. కానీ ఇప్పుడు వీరు తీస్తున్న సినిమాలు అన్ని వరుసగా ఫ్లాప్‌లుగా నిలుస్తున్నాయి.

Mr Bachchan Day 1 Collection: రవితేజ మూవీకి ఊహించని వసూళ్లు.. మొదటి రోజు  ఎన్ని కోట్లో తెలిస్తే! | Ravi Teja Starrer Mr Bachchan Movie Day 1  Worldwide Collections Details - Telugu Filmibeat

ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో.. ఒకసారి చూద్దాం. పూరి జగన్నాథ్‌, హరిష్‌శంకర్, పరశురాం.. ఇదే లిస్టులో ఉంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్లతో తెలుగు సినిమా స్థాయిని వేరే రేంజ్‌కు తీసుకువెళ్లాలని జక్కన్న లాంటి దర్శకులు తెగ ప్రయత్నిస్తుంటే.. ఈ దర్శకులు మాత్రం కమర్షియల్ సినిమాలను సింపుల్గా తెరకెక్కించి హిట్స్ సాధించాలని ఆరాటపడుతున్నారు. ఒక సక్సెస్ ఫార్ములా రెడీ చేసుకుని.. అలాంటి కథలు, కామెడీ, పాటలు, యాక్షన్ మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తూ సక్సెస్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆడియన్స్ ఎప్పటికప్పుడు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. ఈరోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆడియోస్ని థియేటర్స్ కు రప్పించాలంటే.. సినిమాలు మరింత కంటెంట్తో వ‌చ్చి.. థియేటర్లో చూస్తేనే మంచి ఫీల్ కలుగుతుందనే నమ్మకం ఆడియన్స్ కు రావాలి.

లేదంటే ఆ సినిమా హిట్ కావడం చాలా కష్టం. సాధారణంగా ఈ దర్శకులు కొత్త సినిమాలను ప్రకటించగానే.. ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకి పూరి జగన్నాథ్ లైగ‌ర్ సినిమా కొత్త కాన్సెప్ట్ సినిమా తీస్తామని వివరించాడు. కానీ.. ఈ సినిమా కథలో బలం లేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఒకప్పుడు పూరీ జగన్నాథ్ ఎన్నో హిట్ సినిమాలను తెర‌కెక్కించి.. స్టార్ డైరెక్టర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదగాలనుకున్న పూరీ జగన్నాథ్.. తనను తాను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాడు. దీంతో ఈయన మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. ఇక హరీష్ శంకర్ తాజాగా రవితేజ మిస్టర్ బ‌చ్చ‌న్‌ సినిమాతో భారీ ఫ్లాప్ ను మూట కట్టుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ హీరోయిన్‌తో తింగరి మింగిరే డ్యాన్స్‌లు చేస్తూ ఆడియన్స్ డిసప్పాయింట్ చేశాడు. ఓవైపు నేషనల్ ఫిలిం అవార్డులో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఒక్క అవార్డు కూడా దక్కలేదు.

Liger - Saala Crossbreed Full Movie Online in HD in Telugu on Hotstar CA

రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్.. టాలీవుడ్ రేంజ్ మరింతగా పెంచడానికి తెగ ప్రయత్నిస్తుంటే.. ఇలాంటి దర్శకులు ఏమో ఇండస్ట్రీ ఫ్లాపులతో కంటెంట్ లేని కథలతో సినిమాలను తెరకెక్కించి.. తెలుగు సినిమా పరువును మరింత దిగజారుస్తున్నారన్న అభిప్రాయాలు నెటిజన్లలో వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ డైరెక్టర్ల సినిమాలకు కాలం చెల్లిపోయింది అనడంలో సందేహం లేదు. వీళ్ళు అవుట్ డేటెడ్ మైండ్ సెట్ తో సినిమాలు తెరకెక్కించి ఆడియన్స్ పై రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. అయితే చివరకు వారికి ఎలాంటి రిజల్ట్ ఎదురవుతుందో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఇప్పటికైనా మారి.. జనరేషన్‌కు తగ్గట్టుగా కొత్త కథలను ఎంచుకుంటూ మంచి కంటెంట్ సినిమాలను తెరకెక్కిస్తారా.. లేదా ఫేడౌట్ అయ్యి ఇండస్ట్రీకి దూరమవుతారు వేచి చూడాలి.