టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి పాపులర్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్న మహేష్.. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే మహేష్ బాబు నటించిన ఓ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా గతంలో వెంకటేష్ నటించి సక్సెస్ అందుకున్న సినిమాకు కాపీ అంటూ ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి.. ఆ విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మొదటి సినిమా నువ్వే నువ్వే తర్వాత రిలీజ్ అయిన మూవీ అతడు.
మహేష్ బాబు హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు ప్రొఫెషనల్ కిల్లర్‌గా కనిపిస్తాడు. పార్ధు అనే వ్యక్తి చనిపోయాక.. అతని స్థానంలో మహేష్ తన కుటుంబానికి దగ్గరవుతాడు. పార్ధు చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోవడం.. పెద్దయ్యాక ఇంటికి వెళ్లాలనుకోవడం.. అదే విషయాన్ని మహేష్ తో షేర్ చేసుకోవడం.. తన కళ్ళముందే పార్ధు చనిపోవడంతో మహేష్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పార్ధుగా అతని ఫామిలీలో ఎంట్రీ ఇవ్వడం.. ఆ కుటుంబంతో పార్ధుగా కలిసిపోవడం ఇదే అతడు మూవీ కథాంశం. అయితే గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన వారసుడొచ్చాడు సినిమా కూడా దాదాపు ఇదే స్టోరీ లైన్ తో ఉంటుంది. అందులో కూడా వాసు అనే వ్యక్తి చిన్నప్పుడు ఓ అబ్బాయి మరణానికి కారణం అవుతాడు.
ఆపై ఇంటి నుంచి వెళ్లిపోవడం.. ఆ వ్యక్తి టీబీ జబ్బుతో బాధపడుతూ కొద్ది రోజుల్లో చనిపోతానని వెంకటేష్‌కు చెప్పడం.. అతని కోరిక మేరకు వెంకటేష్.. వాసు అని చెప్పుకుంటూ వాసు ఇంటికి వెళ్ళడం వారసుడొచ్చాడు కథ. ఇలా వారసుడొచ్చాడు, అతడు సినిమాల్లో చాలా పోలికలు కనిపిస్తాయి. ఇక వారసుడొచ్చాడు సినిమాకు తనికెళ్ల భరణి రైటర్ గా పనిచేశారు. త్రివిక్రమ్ అతడు మూవీ స్టోరీ నరేట్ చేసిన సమయంలో తనికెళ్ల భరణికి తన వారసుడొచ్చాడు సినిమా స్టోరీ కచ్చితంగా గుర్తుకొచ్చే ఉంటుందనటంలో సందేహం లేదు. ఇక మొదటి నుంచి తణికెళ్ల భరణి నీ నటుడుగానే అంతా చూస్తున్నారు. కానీ.. ఆయనలో ఉన్న మంచి రచయితను దర్శకులు గుర్తించలేకపోయారు. భరణి మాటలను అద్భుతంగా తెరకెక్కిస్తారు. అప్పటి సినీ అభిమానులకు బాగా ఇష్టమైన మాటల రచయితల్లో భరణి కూడా మొదటి వరుసలో ఉంటాడు. అంతేకాదు వెంకటేష్ వారసుడొచ్చాడు సినిమా పాటలు కూడా ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. అచ్చ తెలుగు గ్రామీణ ప్రాంతంలో ఈ సినిమాను తెరకెక్కించారు.