సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఎంతో మంది ఉంటారు. సూపర్ హిట్ సినిమాల్లో బాలనటులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తమ అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంటారు. అందులో కొంతమంది ఇప్పుడు హీరోయిన్లుగా, హీరోలుగా కూడా రాణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే మరికొందరు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి ఇమేజ్ వచ్చిన సినిమాలకు దూరంగా ఉండిపోతున్నారు. అలాంటి వారిలో అమృత మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ కీర్తన కూడా ఒకటి. సాధారణంగా కీర్తన అని చెప్పగానే టక్కున గుర్తుకు రాకపోవచ్చు. అయితే అమృత మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఇట్టే గుర్తు పడతారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో అమృత సినిమా కూడా ఒకటి. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను భారీ లెవెల్‌లో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లను రాబట్టి రికార్డ్ సృష్టించింద
అంతే కాదు తమిళ్ బెస్ట్ ఫిల్మ్‌గా ఈ సినిమాకు అవార్డ్ కూడా వచ్చింది. ఇక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కీర్తన కూడా అవార్డును దక్కించుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం, ఆడియోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా ప్రతి కేటగిరీలోనూ అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో తన నటనతో లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకుని.. విమర్శకుల ప్రశంసలు పొందిన బేబీ పిఎస్ కీర్తన.. ప్రస్తుతం అక్కినేని ఇంటివారి కోడలు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇంతకీ ఈ కీర్తన ఎవరు.. ఈ అమ్మడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. పిఎస్ కీర్తన కోలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ పార్దీ, సీతలై ల కుమార్తె కావడం విశేషం. తల్లిదండ్రులు ఇద్దరు మంచి నటులు కావడంతో చిన్న వయసులోనే సినిమాల్లోకి చేల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీ లో సిమ్రాన్, మాధవన్ ఇద్దరు హీరో హీరోయిన్గా నటించిన కథ మొత్తం కీర్తన చుట్టూనే ఉంటుంది. ఈ సినిమాను తన సొంత తల్లిదండ్రులను కలుసుకోవాలని ఓ చిన్నారి పడే ఆరాటం.. వారి కోసం చేసిన పోరాటమే కీలక కథ. ఈ సినిమాలో కీర్తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లరి పిడుతుగా.. ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమా తోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులను దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తల్లిదండ్రులలాగే సినీ రంగంలో బిజీగా మారుతుందని అంత భావించారు. కానీ అమృత తర్వాత మరో సినిమాలో నటించకుండా ఇండస్ట్రీకి దూరమైంది.
చదువుపై ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమాలకు దూరమైన కీర్తనకు ప్రస్తుతం వివాహం కూడా జరిగిపోయింది. ఇక ఆమె అత్తారిల్లు అక్కినేని ఫ్యామిలీ కావడం విశేషం. కీర్తన భర్త పేరు అక్షయ్. ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కీర్తన అక్కినేని వారింటి పెద్ద కోడలు కావడం విశేషం. కానీ నాగేశ్వరరావు, నాగార్జునల అక్కినేని ఫ్యామిలీ కాదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్.. అక్కినేని ఫ్యామిలీ. శ్రీకర్ తండ్రి అక్కినేని సంజీవ్ తెలుగులో ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అంతేకాదు ఎల్వీ ప్రసాద్, సంజీవి సోదరులు. ఇక కీర్తన భర్త అక్షయ్ హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం కీర్తన పూర్తిగా ఫ్యామిలీని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంది.