మెగాస్టార్ చిరంజీవి.. ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉండేవారు.అయితే ఇండస్ట్రీలో నాగార్జున పేరు లేడీస్ మాన్ గా.. మన్మధుడుగా..వైరల్ అయ్యింది. కానీ మెగాస్టార్ చిరంజీవి కి కూడా లేడీ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఒకప్పుడు ఈయన సినిమాలు విడుదలైతే థియేటర్లకు లేడి అభిమానులు పోటెత్తే వారట. అయితే అలాంటి చిరంజీవిని పెళ్లాడడానికి ఆ ఇద్దరు హీరోయిన్లు షూటింగ్స్ సెట్లోనే కొట్టుకున్నారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు..నిజంగానే చిరంజీవిపై అంత ప్రేమ పెంచుకున్నారా..ఏకంగా చ సురేఖను పక్కనపెట్టి చిరంజీవి తో తాళి కట్టించుకోవాలనుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. చిరంజీవితో ఇద్దరు హీరోయిన్లు నిజంగానే తాళి కట్టించుకోవాలి అనుకున్నారట. అంతేకాదు నేను చిరంజీవితో తాళి కట్టించుకుంటానంటే నేను తాళి కట్టించుకుంటాను అని షూటింగ్ సెట్లోనే గొడవపడ్డారట.ఇక వీరి గొడవను చూసి డైరెక్టర్ కూడా షాక్ అయ్యాడట.
అయితే ఇది నిజంగా జరిగిందే.కానీ సినిమా షూటింగ్లో భాగం. ఇక మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాల్లో ఇంద్ర మూవీ ఒకటి.ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తయింది. దాంతో ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు నిర్ణయించుకొని మెగాస్టార్ బర్త్‌డే కానుకగా ఆగస్టు 22న ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. అదేంటంటే. చిరంజీవి హీరోగా చేసిన ఇంద్ర మూవీలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రేలు హీరోయిన్స్ గా చేశారు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఆర్తి అగర్వాల్ తో చిరంజీవి దాదాపు పెళ్లి వరకు వెళ్తారు కానీ జరగదు.ఇక తర్వాత సోనాలి బింద్రే పరిచయమవుతుంది. అలా సోనాలి బింద్రే చిరంజీవిని ప్రేమించి ఆయనతో పాటు రాయలసీమకు వచ్చేస్తుంది.
ఇక చిరంజీవిపై పగ పెంచుకున్న ఆర్తి అగర్వాల్ కి అసలు విషయం తెలిసి మళ్ళీ ఆయన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఈ సినిమా చివర్లో ఎవరో ఒకరితో పెళ్లి చేయాలి అని డైరెక్టర్ బి. గోపాల్ అనుకున్నారట. కానీ ఈ విషయం తెల్సిన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ లు ఇద్దరూ ఎక్కడా తగ్గలేదట. నేను చిరంజీవితో మెడలో తాళి కట్టించుకుంటానంటే నేను తాళి కట్టించుకుంటాను అని గోల గోల చేశారట. ఇక వీరి రచ్చ మొత్తం చూసిన డైరెక్టర్ చివర్లో చిరంజీవి ఇద్దరితో ఉన్నప్పటికీ ఎవరిని పెళ్లి చేసుకోకుండానే కథ ముగించేశారు. కానీ ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు క్లైమాక్స్‌లో ఎవరో ఒక హీరోయిన్ తో పెళ్లి చేయాలి అనుకున్నారట. ఇక షూటింగ్ సెట్లో జరిగిన రచ్చ కారణంగా ఎవరితో పెళ్లి జరగకుండానే క్లైమాక్స్ పూర్తి చేశారు.