ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న సౌత్ స్టార్ హీరోలు వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత తమ పేర్లను రకరకాల కారణాలతో మార్చుకుంటూ ఉంటారు. గతంలో సినిమాలకు వచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించేందుకు పేర్లు మార్చుకునేవారు.. ఇప్పుడు న్యూమరాలజీ సెంటిమెంట్ తో కూడా పేర్లను మార్చుకుంటున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్న వారు ఉన్నారు. ఇంతకీ అలా పేర్లు మార్చుకున్న సౌత్ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం.

రజనీకాంత్
కోలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న రజినీకాంత్ టాలీవుడ్ లోను అదే రేంజ్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈయన మొదట్లో బస్ కండక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజిని అసలు పేరు శివాజీ గైక్వాడ్. సినిమాల్లోకి వచ్చిన తరువాత రజినీకాంత్‌గా తన పేరును మార్చుకున్నారు.

చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ గా దూసుకుపోతున్న చిరంజీవి దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న పాత్రలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయ‌న‌ ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి తన ఫ్యామిలీ నుంచి ఏకంగా అరడజన్ మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవిగా ఆయన పేరును మార్చుకున్నారు.

పవన్ కళ్యాణ్
ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరును పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నారు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ ఇమేజ్ తో ఇండస్ట్రీలోనూ.. జనసేన అధినేతగా పాలిటిక్స్ లోను దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ మొదట చిన్న చిన్న పాత్రలో నటిస్తూనే హీరోగా మారాడు. పూరి జగన్నా డైరెక్షన్‌లో ఇడియట్ సినిమాతో స్టార్ హీరోగా మారాడు. అసలు పేరు రవిశంకర్ రాజు కాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక రవితేజ గా మార్చుకున్నారు.

నాని
నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోకి అవకాశాన్ని దక్కించుకున్నాడు అష్టాచమ్మా సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమైన నాని అసలు పేరు నవీన్ బాబు. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత అతనికి పేరు నాని గా మార్చుకున్నాడు.

సాయి ధరమ్ తేజ్
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీ లోకి వ‌చ్చిన సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. అయితే ఇటీవల సాయి ధరమ్ తేజ్ తన పేరును తల్లి పేరుతో కలుపుకుంటూ.. సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నారు.

అడవి శేష్‌
టాలీవుడ్ హీరో అడవి శేష్‌ మొదట పలు సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. తరువాత హీరోగా అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుకున్నాడు. టాలెంటెడ్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అయ‌న అస‌లు పేరు సన్నీ చంద్ర.

విశ్వ‌క్ సేన్‌
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్‌ అసలు పేరు దినేష్ నాయుడు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును విశ్వక్ గా మార్చుకున్నాడు.

ఆకాష్ జ‌గ‌న్నాథ్‌
పూరి జగన్నాథ్ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆకాష్‌పూరి ఇప్పుడిప్పుడే హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఆకాష్‌ తన పేరును ఆకాష్ జ‌గ‌న్నాథ్‌గా మార్చుకున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

హీరో జగపతిబాబు ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సహ‌య‌ నటుడిగా ప‌లు పాత్రల్లో నటిస్తూ.. విలక్షణ నటుడుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన.. అసలు పేరు జగపతిరావు చౌదరి. తన పేరును ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత జగపతిబాబుగా మార్చుకున్నారు.