హ్యాపీ బర్త్డే: కలియుగ కర్ణుడు సోను సూద్ ఆస్తి విలువ అన్ని కోట్లా.. లిస్ట్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ సోనూ సూద్‌కు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సోనూసూద్.. కరోనా సమయంలో ఎంతమందికి సహాయం చేస్తూ రియల్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక నేడు జూలై 30 సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి.. సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాంఘిక సేవతో ప్రజలకు దగ్గరయ్యాడు. ఏటా కోట్లాది డబ్బులు సామాజిక సేవలకు ఉపయోగిస్తూ.. కలియుగ కర్ణుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. కష్టం అన్నవారికి లేదనకుండా సహాయం చేసే ఈయన 1999లో కల్ల‌గర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

టాలీవుడ్‌లోను ఎన్నో సినిమాల్లో నటించిన ఈయనకు.. అరుంధతి సినిమాలో పశుపతిగా నటించడంతో భారీ పాపులారిటీ దక్కింది. తర్వాత బాలీవుడ్‌లో దబాంగ్, జోధా అక్బర్ తో పాటు కన్నడలోనూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇండస్ట్రీలో తన సంపాదించిన ఆస్తిలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తున్నాడు. తన చారిటీ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేసిన సోనూసూద్.. ప్రజల్లో దేవుడిగా నిలిచాడు. ఈక్ర‌మంలో సోను సూద్ ఆస్తుల విలువ నెట్టింట వైరల్ గా మారింది. సోను సూద్ ప్రస్తుత ఆస్తులు విలువ ఏకంగా రూ.140 కోట్ల పై చిలుకేన‌ట‌. ఇక న‌ట‌న‌తో ప‌టు, బ్రాండ్ ప్ర‌మోష‌న్స్‌, హోటల్ బిజినెస్ ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

ఆయనకు వచ్చిన రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం అందిస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. లగ్జరీ కార్లు పైన ఆయనకు పెద్దగా వ్యామోహం లేదు. దీంతో ఆయన దగ్గర పోర్ష పనామెరా, బెంజ్ ఎంఎల్ క్లాస్ కార్లు మిన‌హా మిగతావన్నీ చిన్న చిన్న కార్లే. ఇక ఈయనకు ఓన్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. వీటితో పాటు ముంబైలో పెద్ద ఇల్లు.. సొంత రెస్టారెంట్ కూడా ఉన్నాయి. లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉందట. ఇక సోనూ సూద్ ఒక్కో సినిమాకు దాదాపు రెండు నుంచి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఇటీవల కాలంలో విలన్ పాత్రలను సోను సూద్ రిజెక్ట్ చేస్తున్నాడట. దీంతో ఆయనకు పెద్దగా అవకాశాలు రావ‌డం లేదని టాక్.