ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో బన్నీ నటనకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డులు కూడా దక్కించుకొని రికార్డ్ సృష్టించాడు. అయితే హీరోగా నటించక ముందే బన్నీ తన కెరీర్లో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టీస్ట్‌గా నటించాడు.
గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఏంట్రీ ఇచ్చిన బన్నీ తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందే చిరంజీవితో డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బన్నీ నటించాడని చాలామందికి తెలుసు. కానీ దీనికంటే ముందే బన్నీ మరో సినిమాలో చిరంజీవితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇంతకీ ఆ మూవీ మరేదోకాదు చిరంజీవి హీరోగా నటించిన విజేత. ఈ సినిమా 1985లో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు మేనల్లుడిగా బన్నీ ఓ చిన్న పాత్రలో కనిపించాడు.
తర్వాత 1986లో కమల్ హాసన్, కె.విశ్వనాథ్ కాంబోలో తెరకెక్కిన స్వాతిముత్యం సినిమాలోను అల్లు అర్జున్ మెప్పించాడు. ఇక గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ సినిమా సక్సస్ తర్వాత.. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6న రిలీజ్ కానున్న ఈ సినిమా ఈసారి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.