ఆ టాలీవుడ్ హీరో సినిమా రీమేక్ చేసి హిట్ కొట్టిన చిరంజీవి.. ఆ రికార్డ్ క్రియేట్ చేసిన ఫ‌స్ట్ హీరో..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లు అందుకుంటూ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్.. గతంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రీమేక్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడంటూ.. అప్పటివరకు ఆ సినిమాతో తాను క్రియేట్ చేసిన రికార్డును మరే టాలీవుడ్ స్టార్ హీరో ట‌చ్‌ చేయలేకపోయాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఏ సినిమా రీమేక్ గా చిరంజీవి సినిమా తెర‌కెక్కి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుందో.. ఆ రికార్డు ఏంటో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, చిరంజీవికి మధ్య ఎప్పుడు మనస్పర్ధలు ఉంటాయని వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే గతంలో రాజశేఖర్ నటించిన ఓ సినిమాకు చిరంజీవి రీమేక్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడట. చిరంజీవి కెరీర్‌లో ఎన్నో రీమిక్స్ ఉన్నాయి. ఇక చిరంజీవికి.. మెగాస్టార్ ఇమేజ్ రావడానికి తను నటించిన కమర్షియల్ సినిమాలతో పాటు.. రీమిక్స్ సినిమాలు కూడా ప్రధాన కారణం. ఇప్పుడు ఓటీటీలు వచ్చి రీమేక్ ట్రెండ్ వర్కౌట్ కావడం లేదు.. కానీ ఒకప్పుడు రీమేక్ సినిమాల జోరు ఇండస్ట్రీలో బీభత్సంగా ఉండేది. ఇక రాజశేఖర్ ప్రస్తుతం హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు కానీ.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదట పది, పదిహేనేళ్లు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లకు గట్టి పోటీ ఇస్తూ స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు. వాళ్లని డామినేట్ చేస్తూ హిట్ అందుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇక రాజశేఖర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అంకుశం. యాక్షన్ థ్తిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో జీవిత హీరోయిన్గా, రామిరెడ్డి విలన్ గా నటించారు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వ‌చ్చిన ఈ సినిమా 1989లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

కమర్షియల్గా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో చర్చించుకుంది. ఇక ఇదే సినిమా హిందీ రీమేక్‌లో చిరంజీవి హీరోగా నటించాడు. బాలీవుడ్‌లో ప్రతిబంధ్‌ పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. రవిరాజా. పిన్నిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో చిరంజీవికి జోడిగా జూహీ చావ్లా నటించి మెప్పించింది. అయితే హిందీ వర్షన్ లోను రామిరెడ్డి నే విలన్‌గా కనిపించారు. ఈ మూవీ అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే చిరంజీవికి బాలీవుడ్ కొత్త కావడంతో తెలుగులో ఉన్నంత సక్సెస్ అందలేదు. కాగా బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ఆరెంజ్‌ సక్సెస్ అందుకున్న టాలీవుడ్ ఫస్ట్ హీరో చిరంజీవి కావడం విశేషం. ఈ రికార్డ్‌ను అప్పటివరకు మరే టాలీవుడ్ హీరో కూడా ట‌చ్‌ చేయలేక పోయాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్ అవ్వడంతో.. రాజశేఖర్ హిట్ చిరంజీవి రీమేక్ చేసి ఇంతలా సక్సెస్ అందుకున్నాడా అంటూ షాక్ అవుతున్నారు.