‘ ప్రేమలు ‘ కంటే ముందే మమిత బైజు ఓ తెలుగు సినిమాలో కనిపించిందా.. ఆ మూవీ ఏంటంటే..?!

కోలీవుడ్ యంగ్ బ్యూటీ మమితా బైజు కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమలు మూవీ తెలుగు వర్షన్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమ‌తో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్ బ్యూటీగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లోను స్టార్ హీరోల సినిమాల‌లో అవకాశాలు అందుకుంటూ నెటింట వైర‌ల్‌గా మారింది. అయితే మమిత బైజు ప్రేమలు సినిమాలో హీరోయిన్గా నటించక ముందే.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్‌లోను మెప్పించింది. ఈ క్రమంలో మ‌మిత ఓ టాలీవుడ్ సినిమాలో నటించిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో మమత బైజు ఏ రోల్ లో నటించిందో ఒకసారి చూద్దాం.

Premalu' trailer: The Naslen and Mamitha Baiju starrer is a hilarious  journey through love and being friend zoned

యంగ్ హీరో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన పడి పడి లేచే మనసు హ‌ను రాఘవపూడి డైరెక్షన్లో తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. 2018 డిసెంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఊహించిన సక్సెస్ అందుకోలేదు. అయితే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్, సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సాయి పల్లవి తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా షూట్ మొత్తం కోల్కతాలో జ‌రిగింది. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ మూవీకి హైలెట్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ప్రేమలు మూవీ బ్యూటీ మమతా కూడా నటించిందట. ఈ సినిమాలో సాయి పల్లవి డాక్టర్ గా మెప్పించిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా సాయి పల్లవి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి రోడ్డుపై ర్యాలీ చేస్తూ క‌నిపిస్తుంది. ఈ ర్యాలీ పిక్ లో సాయి పల్లవి వెనక మమితా బైజు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెటింట వైర‌ల్ అవ్వ‌డంతో.. మమత బైజు హీరోయిన్ గా మారకముందే టాలీవుడ్ లో సాయి పల్లవి నటించిన పడి పడి లేచే మనసులో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించిందా అంటూ అంతా షాక్ అవుతున్నారు. ఆమె ఇప్పటికీ, అప్పటికీ ఏమాత్రం మారలేదు అంటూ.. తమ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆమె మమిత బైజు కాదని.. ఆమె పోలికలతో ఉన్న మరో అమ్మాయిని మమిత బైజు అని అందరూ భ్రమ పడుతున్నారు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాల్లో సాయి పల్లవి తో కలిసి నటించిన మమత బైజునా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.