“అది చూసి ఆ రోజు బాగా ఏడ్చేశాను”.. ఇంట్రెస్టింగ్ విషయాని బయటపెట్టిన రష్మిక..!!

ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిన తోపైన హీరో హీరోయిన్ అయినా కొన్ని కొన్ని విషయాలకు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవుతారు కూడా.. ఎందుకంటే వాళ్లు మనుషులేగా ఒక సాడ్ మూమెంట్ వచ్చినప్పుడు ఏడవడం ..ఫన్నీ మూమెంట్ వచ్చినప్పుడు నవ్వుకోవడం.. జాలి మూమెంట్ వచ్చినప్పుడు నవ్వడం ఎంజాయ్ చేయడం సర్వసాధారణం. అయితే ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్ అయినా ఎలాంటి సినిమాలు నటించిన స్టార్స్ అయినా వాళ్లకంటూ కొన్ని పర్సనల్ ఫీలింగ్స్ ఇష్టం ఉంటాయి.

తాజాగా అలాంటి విషయాన్ని బయటపెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ తన చేతిలో ఆరు బడా ప్రాజెక్ట్స్ పట్టుకొని ఉంది.. ఆరు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేవే మూవీలే కావడం గమనార్హం . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు.

కాగా రష్మిక మందన్నా తన కెరియర్ లో ఎన్నో సినిమాలు చూసింది.. ఎన్నో లాంగ్వేజెస్ సినిమాలను చూసి సైతం ఎంజాయ్ చేసింది.. నటించింది మెప్పించింది ..కానీ ఒక సినిమా చూసి ఏడ్చిన సందర్భం మాత్రం ఆమె లైఫ్ లో ఒకే ఒక్కటి ఉందట . అదే బేబీ.. వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా చూసి రష్మిక మందన్నా ఏడ్చేసిందట. ఈ విషయాన్ని స్వయాన ఆమె చెప్పుకు రావడం గమనార్హం. ఆరోజు ఎందుకో ఏడుపు వచ్చేసింది అంటూ రష్మిక బయటపెట్టింది . ఆమె మాటలు ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారాయి..!!