బాలయ్యకి తండ్రి అంటే ఎంత ఇష్టమో.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏం చేసారో చూడండి..!!

బాలకృష్ణ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరో ..ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే తప్పు చేస్తే చీల్చి చెండాడేస్తాడు.. ఇది తప్పు అని చెప్పే సత్తా ఉన్న మగాడు .. అలా ప్రూవ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . బాలకృష్ణ ఇన్నాళ్లు రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నాడు ..ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్లో బిజీ కాబోతున్నాడు . నేడు తన తండ్రిగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి .

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని బాలకృష్ణ నివాళులర్పించారు . అయితే ఇదే మూమెంట్లో బాలకృష్ణ స్పెషల్ చేంజింగ్ క్వాలిటీని ఫ్యాన్స్ నోటీస్ చేశారు. బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది . బాలయ్యకు ఇష్టం లేని పని చేస్తే వాళ్ళను అక్కడే అరిచి గోల చేసి తాట తీసేస్తారు . అయితే రీసెంట్గా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నివాళులర్పించడానికి వెళ్లిన బాలయ్యను చూసి అక్కడ ఉండే బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అరుపులు కేకలతో దద్దరిల్లించారు .

సాధారణంగా అలాంటి చోటుకెళ్ళినప్పుడు బాలయ్య సైలెన్స్ కోరుకుంటారు.. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆయన చూసిన అత్యుత్సాహంతో అరుపులు కేకలతో హోరెత్తించారు . కానీ బాలయ్య మాత్రం వాళ్ళని ఏమీ అనలేదు సైలెంట్ గా వెళ్ళిపోయారు. నాన్నగారి సమాధి వద్ద నివాళులర్పించారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో బాలయ్య చాలా మారిపోయాదూ అన్న కామెంట్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!