మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా ట్రెండ్ అవుతున్నాయో ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తున్నాం . అయితే ఎంతమంది మెగా కుటుంబ సభ్యుల పేర్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైన ఒక పేరు మాత్రం అస్సలు ట్రోలింగ్కి గురవ్వదు. అదే ఉపాసన ..రామ్ చరణ్ భార్య.. తన పని తాను చూసుకుంటూ నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తూ తన లైఫ్ ముందుకు తీసుకెళుతున్న ఉపాసన అంటే అందరికీ అదొక ప్రత్యేకమైన గౌరవం .
అంతేకాదు ఆమె అంటే చాలా చాలా ఇష్టం కూడా .. ఎంతోమంది మహిళలు ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఉపాసనకు సంబంధించిన ఒక మేటర్ బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ లో ఉండే అందరి లేడీస్ లో అందరికన్నా ఉపాసన అనే టాప్ . అది ఏ విషయంలో అంటే ఆస్తి విషయంలో ..ఉపాసన గోల్డెన్ స్పూన్ తో పుట్టిన బేబీ ..అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు ..
ఎన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతిరాలు అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . కాగా మెగా ఫ్యామిలీ లో ఉండే అందరూ లేడీస్ కూడా తమ పేరుపై కాస్తో కూస్తో ప్రాపర్టీస్ ఉన్నాయి . అయితే మెగా ఫ్యామిలీ లో ఉన్న లేడీస్ అందరిలో కల్లా ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్న లేడీ మాత్రం ఉపాసననే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఉపాసన పేరుపై దాదాపు 1150 కోట్ల ఆస్తులు పైనే ఉన్నాయట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!