తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ కొన్ని కొన్ని సార్లు రష్మిక పరోక్షకంగా విజయ్ దేవరకొండ తో ప్రేమాయణాని బయట పెట్టేస్తుంది. అయితే ఈ విషయాన్ని నార్మల్గానే చెప్పొచ్చుగా ఎందుకు సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ లోనే చెప్తుంది..? అనే విషయం మాత్రం జనాలకు అర్థం కావడం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ చేతిలో ఆరు బడా ప్రాజెక్ట్స్ పట్టుకుని ఉంది . ఆరు కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలే కావడం గమనార్హం.
రీసెంట్గా రష్మిక మందన్నా.. ఆనంద్ దేవరకొండ నటించిన ఈవెంట్లో రచ్చ రంబోలా చేసింది. వైట్ కలర్ డిజైనర్ శారీతో అందాలను ఆరబోయడమే కాకుండా అద్భుతమైన రేంజ్ లో ఆకట్టుకుంది. ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ రష్మికను పలు ప్రశ్నలు అడుగుతాడు ..వాటికి ఫన్నీ ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంది రష్మిక . ఈ క్రమంలోనే మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అనే ప్రశ్న అడుగుతాడు.
వెంటనే మైకు పక్కకు పెట్టేసి “రేయ్ నీయబ్బ” అంటూ” మనం మనం ఒక ఫ్యామిలీ ఇలా బుక్ చేస్తావా ..?అన్న విధంగా సరదాగా ఆటపట్టిస్తుంది . దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే జనాలు అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేసేస్తారు . మనం మనం ఒక ఫ్యామిలీ అంటే విజయ్ దేవరకొండతో రిలేషన్షిప్ ను కన్ఫామ్ చేసినట్లేగా..? అంటున్నారు అభిమానులు . మరి కొంతమంది మాత్రం రష్మిక పరోక్షకంగా తాను విజయ దేవరకొండను ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని బయట పెట్టేసింది అంటున్నారు. హింట్ ఇచ్చిందో..? క్లారిటీ ఇచ్చిందో..? తెలియదు కానీ మాస్ రిప్లై మాత్రం రష్మిక మందన్నా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చేసింది అన్నది మాత్రం వాస్తవం..!!