అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్ బ్యూటీ.. ఇక ఊపిరి పీల్చుకోండి రా అబ్బాయిలు..!!

సోషల్ మీడియాలో కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకోకపోయిన సరే ..వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. కొంతమంది అదే విధంగా వార్తలను సృష్టిస్తున్నారు. కాగా తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా హాట్ హాట్ గా ట్రెండ్ అయ్యే హీరోయిన్ నమిత కూడా విడాకులు తీసుకోబోతుంది అన్న వార్త బాగా ఊపందుకుంది. మనకు తెలిసిందే నమిత స్టార్ హీరోయిన్ . జెమిని సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత బాలయ్య నటించిన సింహ అదే విధంగా ప్రభాస్ బిల్ల సినిమాలతో క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది .

ప్రభాస్ బ్యూటీ అంటూ ముద్దుగా ట్యాగ్ చేయించుకునేది ఈ నమిత . కాగా సినిమా అవకాశాలు తగ్గడంతో వీరేంద్ర చౌదరి అనే అతన్ని పెళ్లి చేసుకున్న నమిత.. 2022వ సంవత్సరంలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో చక్కగా లీడ్ చేస్తూ వచ్చింది. వీళ్ళకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే సడన్గా నమిత విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం ఊపందుకుంది. దీనితో నమిత స్పందించింది .

“ఎవరు ఎవరు చెప్పారు..? మీకు మేము విడాకులు తీసుకుంటున్నామని..? మేము ఏమన్నా చెప్పామా..? పోనీ మీ దగ్గర ప్రూఫ్ ఉందా..? అలా ఎలా వార్తలు రాసేస్తారు..? మేము రొమాంటిక్ గా ఉన్నటువంటి సంతోషంగా ఉన్న ఫోటోలు మీకు సోషల్ మీడియాలో కనిపించడం లేదా..? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది . అంతేకాదు మేము చాలా హ్యాపీగా ఉన్నాం.. మా వైవాహిక జీవితాన్ని ముందుకు తీసుకెళుతున్నాం అంటూ చెప్పుకొచ్చింది . దీంతో నమిత కోపంగా చెప్పిన ఆమె విడాకులు తీసుకోవట్లేదు అన్న వార్తకు క్లారిటీ వచ్చింది . దీంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నట్లయింది..!!