NTR 101వ జయంతి: అందరి ముందే అలాంటి పని చేసిన జూ ఎన్టీఆర్..!

నేడు ..స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నూట ఒకటవ జయంతి. ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా పలువురు ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు ..ఆయన ఇండస్ట్రీకి అదేవిధంగా ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు . మరి కొంతమంది కుటుంబ సభ్యులు ..జనాలు .. ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ వెల్ విషర్స్ రాజకీయ నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు నివాళులర్పించారు .

కాగా నేడు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ .. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తన తాత ఆత్మకు శాంతి చేకూరాలని తన తాత ఆశయాలు ఎప్పటికైనా నెరవేరాలని ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కాగా ఇదే క్రమంలో అందరి ముందు ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి . తారక్ చాలా చాలా స్ట్రాంగ్ ..ఎమోషనల్ అవుతారు తప్పిస్తే ఎక్కడ తనలోని ఫీలింగ్స్ ను బయటపెట్టారు .

కానీ ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ తన తాత గారిని తలుచుకొని ఎమోషనల్ అయిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి . ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించిన ఫొటోస్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాతో పాటు వార్ 2 అనే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా ఆగస్టులో సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు..!!