కుర్రాళ్ళని కంటి చూపుతో టెంప్ట్ చేసే ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ చిన్నారి.. ఒకానొక టైంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీలోను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ చిన్నది.. ఎప్పటికప్పుడు నెటింట వైరల్ గా మారుతూనే ఉంటుంది. తన నవ్వుతోనే కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న ఈ అమ్మ‌డు.. ఊరచూపుతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. ఇంతకీ ఈ స్టార్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు అందాల భామ పూజ హెగ్డే.

Pooja Hegde - Now and FOREVER gonna be “Mumma's girl” 🥰... | Facebook

తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరస సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో నటించినా పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ లక్ నడుస్తుంది. ఆమె ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అసలు వర్కౌట్ కావడం లేదు. ఇటీవల తెలుగులో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గా నిలవడంతో టాలీవుడ్‌కు దూరమైంది.

7 times Pooja Hegde broke the internet with her fashion statements

త‌ర్వాత ఈ చిన్నది బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అక్కడ కూడా ఆమెకు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి లైఫ్ ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోస్ తో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఈ అమ్మడి లేటెస్ట్ లుక్స్ ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్‌కు నెటిజన్స్ తమదైన స్టైల్ లో క్రేజీ కామెంట్స్ చేస్తూ ఆమెను మరింత వైరల్ చేస్తున్నారు.