అలాంటి రికార్డ్ సొంతం చేసుకున్న చిరంజీవి.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అది మెగాస్టార్ రేంజ్..?!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసారా ఫేమ్ మ‌ల్లిడి వ‌శిష్ఠ‌ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభ‌ర‌లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే నా సామిరంగా బ్యూటీ ఆషికా రంగనాథన్ మరో హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్.. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. సినీ రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తించి దుబాయ్ ప్రభుత్వం మెగాస్టార్‌కు గోల్డెన్ వీసాను అందించింది. ఈ వీసా ఉన్నవారు దుబాయ్ లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పదేళ్లపాటు ఉండవచ్చు. 2019 నుంచి పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారందరికీ దుబాయ్ ప్రభుత్వం ఇలా గోల్డెన్ వీసాతో ట్రీట్ ఇస్తోంది.

Ashika Ranganath joins Chiranjeevi in the socio-fantasy 'Vishwambhara' | -  Times of India

కాగా చిరంజీవి కంటే ఆయన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కొణిదల, అల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందే ఈ విశిష్ట గౌరవాన్ని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవికి కూడా ఈ గోల్డెన్ వీసా దక్కింది. అంతే కాదు చిరంజీవి కంటే ముందు కోలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్‌కు చెందిన ఎంతోమంది తారలకు ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఇప్పటికే రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, భోనీ కపూర్, రణ్‌వీర్ సింగ్, మ‌మ్ముటి, దుల్క‌ర్ స‌ల్మాన్, మోహ‌న్‌ లాల్ లాంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్కు ఈ గోల్డెన్ వీసా అందింది.

ఇక ఇప్పుడు ఈ వీసాను చిరంజీవికి కూడా ఇవ్వడంతో మెగా ఫాన్స్ ఆనంద పడుతున్నారు. కాగా చిరంజీవి ఎప్పటికప్పుడు ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రశంసలు అందుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆయనకు సంబంధించిన మరో మంచి విషయం నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రభుకు ఆయన ఉచితంగా గుండె సమస్యకు వైద్యం చేయించారని స్టార్ హాస్పిటల్ లో రూపాయి ఖర్చు లేకుండా స్టాంట్స్‌ వేయించారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మెగాస్టార్ మంచి తనానికి ఇది కూడా మరో ఎగ్జామ్పుల్ అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు.