ఎన్టీఆర్ తన కూతుర్లకు-కొడుకుల్లకు పెట్టిన.. పేర్లు వెనుక ఉన్న స్పెషాలిటీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు గురించి ఎవరికీ తెలియని విషయం కాదు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉంది అంటే కారణం ఎన్టీరామారావు గారు అనే విషయం మనం మర్చిపోకూడదు . నేడు ఆయన 101వ జయంతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ రాజకీయ నాయకులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు .

నందమూరి బాలకృష్ణ .. ఎన్టీఆర్ ..కళ్యాణ్ రామ్ .. లక్ష్మీపార్వతి లాంటి వాళ్లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే సీనియర్ ఎన్ టీఆర్ తన కూతుర్లకు కొడుకులకు పెట్టిన పేర్లతో సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్టీ రామారావు గారు ఏదైనా సరే ఆచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా సక్సెస్ అవుతారు . ఆయన తన కూతుర్లకు కొడుకులకు పెట్టిన పేర్లలో ఒక స్పెషాలిటీ ఉంది . ప్రెసెంట్ అదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఎన్టీఆర్ తన పిల్లల పేర్లను చాలా స్పెషల్ గా నేమ్‌స్ పెట్టారు . అబ్బాయిల పేర్లు చివరిన కృష్ణ వచ్చేలా అమ్మాయిల పేర్లు చివరన ఈశ్వరి అనే వచ్చేలా పెట్టుకోవచ్చారు అన్న విష్యం వైరల్ గా మారింది . రామకృష్ణ ..సీనియర్ జయకృష్ణ ..సాయి కృష్ణ ..హరికృష్ణ ..మోహనకృష్ణ ..బాలకృష్ణ ..జూనియర్ జయకృష్ణ.. ఎన్టీఆర్ కుమారులు. మీరు గమనించినట్లయితే వీరందరి పేర్ల చివరినా కృష్ణా అని ఉండడం స్పెషల్ .

అలాగే అమ్మాయిల పేర్లను పరిశీలిస్తే పురందేశ్వరి.. భువనేశ్వరి ..లోకేశ్వరి ..ఉమామహేశ్వరి అనే పేర్లను పెట్టుకొచ్చారు . ఎన్టీఆర్ ప్రతి పేరు చివరన కూడా ఈశ్వరి వచ్చేలా చాలా డిఫరెంట్ గా పేర్లను సెలెక్ట్ చేసుకున్నారు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది . ఎన్టీఆర్ తన కూతుర్లు కొడుకుల పేర్లు విషయంలో ఒక ప్రాస ఫాలో అయ్యారు . ఎన్టీఆర్ కి దైవభక్తి ఎక్కువ అందుకే లార్డ్ కృష్ణ పేరు కొడుకులకు అలాగే శివుడు మరొక పేరుగా ఈశ్వరుడులోని ఈశ్వరి అమ్మాయిల పేర్లలో చివర వచ్చేలా చూసుకున్నాడు .