పెళ్లయిన మూడు నెలలకే భర్తకు విడాకులు.. దాని గురించి మాట్లాడదలచుకో లేదంటూ నటి షాకింగ్ కామెంట్స్..?!

సినీ ఇండస్ట్రిలో గత కొంతకాలంగా ఎక్కడ చూసినా విడాకుల వార్తలే వినిపిస్తున్నాయి. ఎంతమంది స్టార్ సెలబ్రెటీస్ ప్రేమించి వివాహం చేసుకున్న కొద్ది రోజులకే వారికి విడాకులు ఇస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఇప్పటికే డివోర్స్‌ అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. కొందరు అయితే ఇన్ డైరెక్ట్ గా పెళ్లి ఫోటోలను.. ఒకరి సోషల్ మీడియా ఎకౌంట్ను మరొకరు అన్‌ ఫాలో చేస్తూ.. ఇలా ఇన్‌డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారు. తర్వాత దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మరో ప్రముఖ నటి దివ్య అగర్వాల్ తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వైర‌ల్ అయ్యిన సంగతి తెలిసిందే.

Divya Agarwal Breaks Silence On Divorce Rumours With Apurva: What Are They  Expecting, Baby- Republic World

దానికి కారణం దివ్య సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం. అయితే దీంతో దివ్య విడాకులు తీసుకుంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కాగా తాజాగా డివోర్స్ రూమర్స్ పై దివ్య స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలపై నేను మాట్లాడాలనుకోవడం లేదు. నేను పెళ్లి ఫోటోలు మాత్రమే తొలగించలా.. మొత్తం 2500 పోస్టులను డిలీట్ చేశా. అయితే మీడియా వారు కేవలం నేను డిలీట్ చేసిన పెళ్లి ఫోటోలు పై మాత్రమే ఫోకస్ పెట్టారు. ఈ వార్తలు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. చాలామంది గెస్ చేయలేని పని నేను చేశా. దీంతో వీళ్లంతా ఇప్పుడు నా నుంచి పిల్లల్ని లేదా విడాకులు కోరుకుంటునటున్నారు.. అది అస్సలు జరగదు అంటూ రియాక్ట్ అయింది.

నిజమేంటంటే నేను నా మొదటి ప్రొఫైల్ పిన్ చేసిన పోస్ట్ గురించి ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్నా.. ప్రతి సినిమా ఆనందంగా ముగుస్తుంది. అంటూ త‌న భ‌ర్త గురించి వివ‌రించింది. కాగా దివ్య అగర్వాల్ 4 ఏళ్ళు వ‌రుణ్ సూద్తో ప్రేమాయ‌ణం తర్వాత.. మనస్పర్ధలతో అతనికి బ్రేకప్ చెప్పి.. 2023లో బిజినెస్ మ్యాన్ అపూర్వ పడ్గాంకర్ ను నిశ్చితార్థం చేసుకుంది. ఏడాది గ్యాప్ తో 2024 ఫిబ్రవరిలో అతను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అయితే పెళ్లైన మూడు నెలలకే ఇలాంటి వార్తలు వైరల్ అవడంతో దీనిపై స్పందించి.. డివోర్స్ వార్తలకు చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.