నాగార్జున రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పవన్.. ఇంతకీ ఏ మూవీ అంటే..?!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తెలుగు సినిమాలతో ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన్మధుడిగా భారీ పాపులారిటి దక్కించుకున్న నాగ్‌ ఏడుపాదుల వయసు దాటిన ఇప్పటికీ యంగ్ లుక్‌లో జ‌నాని ఆకట్టుకుంటున్నాడు. తను నటించిన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ సంపాదించుకున్న నాగ్ తెలుగులో మాస్ క‌థ‌ట‌నుంచి.. లవ్ స్టోరీస్, భక్తి రస సినిమాలు.. ఇలా ప్రతి జానర్‌లోనూ తనకంటూ ప్రత్యేకముద్ర ఏర్పరచుకున్నాడు. త‌న‌ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా టాప్ డైరెక్టర్ చెప్పినా ఓ కంటెంట్ నచ్చినా.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక కథను రిజెక్ట్ చేశార‌ట‌.

Here's why Akkineni Nagarjuna decided to take a sabbatical from signing new  films | Telugu Movie News - Times of India

అలా నాగార్జున వదులుకున్న మూవీతో ప‌వ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్‌ అందుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లోనే స్పెషల్ మూవీస్ లో బద్రి ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ హిట్ ఇది అనడంలో సందేహం లేదు. నిజానికి బద్రి మొదటి నాగార్జున చేయవలసిందని.. కథను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముందుగా నాగార్జునకు వినిపించగా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను నాగ్ వదులుకున్నారని.. అలా క‌థ‌ పవన్ వద్దకు వెళ్లిందని తెలుస్ఉంది. క్లైమాక్స్ కాస్త మార్చుకొని రండి అంటూ పవన్ పూరీకి కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.

Badri (2000) - IMDb

దీంతో పవన్ సరిగ్గా క్లైమాక్స్ విని ఉండరు అనుకున్న పూరి.. తర్వాత రోజు మళ్ళీ అది స్టోరీని వినిపించాడట. స్టోరీ విన్న పవన్ అసలు క్లైమాక్స్ మార్చలేదు కదా.. నిన్న విన్న స్టోరీ మళ్ళీ చెప్పావు అంటూ ప్రశ్నించారట. దీంతో పూరి తనకు క్లైమాక్స్ మార్చడం అసలు ఇష్టం లేదని.. స్టోరీ సరిగా విన‌లేదేమో అని మళ్లీ చెప్పానంటూ చెప్పుకొచ్చాడట. దీంతో పూరి కాన్ఫిడెన్స్ నచ్చిన పవన్.. బ‌ద్రి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకవేళ తాను చెప్పినట్లు క్లైమాక్స్ మార్చితే ఈ సినిమాలు చేయకూడదని భావించాడట పవన్. అలా ప‌వ‌న్ పూరీతో బ‌ద్రీ చేయ‌డంతో.. ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది.