ఏపీ రాజకీయాలల్లో మంటపెడుతున్న జూ ఎన్టీఆర్ ట్వీట్..టైం చూసి కొట్టాడుగా..!!

ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన అది ఇష్యూ అవుతుంది .. మాట్లాడకపోయినా అది ఇష్యూ గా మారుతుంది ..కావాలని చేస్తున్నారు ..లేక తెలిసి తెలియక పొరపాటున అలా ఎన్టీఆర్ పేరుని పలు ఇష్యూస్ లోకి లాగుతున్నారు .. అర్థం కావడం లేదు.. ఈ మధ్యకాలంలో రాజకీయాలలో ఆయన పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనం చూసాం. నాకు ఈ రాజకీయాలు వద్దురా బాబోయ్ అంటూ ఎన్టీఆర్ నెత్తి నోరు మొత్తుకున్న ఆయనను పరోక్షంగా రాజకీయాల్లోకి లాగుతూ ముడిపెడుతూ దారుణాతి దారుణంగా మాట్లాడారు.. ట్రోల్ చేశారు.

అయితే ఇప్పుడు కూడా అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు . ఎన్టీఆర్ తన తాత గారిని స్మరించుకుంటూ ఒక్క ట్వీట్ చేశాడు. అంతే అందులో ఒకటికి 100 తప్పుడు అర్ధాలను తీసి సోషల్ మీడియాలో ఆయన పేరుని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కూడా నివాళులర్పించారు . జూనియర్ ఎన్టీఆర్ ఈ క్రమంలోనే ట్వీట్ చేసిన పోస్ట్ ఏపీ రాజకీయాలలో కొత్త అర్ధాలు తెచ్చేలా ఉంది అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు..!!


“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..” అంటూ ఎప్పటిలానే ట్వీట్ చేశాడు తారక్. ఇకపోతే “తెలుగు దేశం చిన్నబోతుంది… పెద్ద మనసుతో మళ్లీ రా.. తాతా” అంటూ ఇన్ డైరెక్ట్ గా ఇప్పుడున్న నాయకులను టార్గెట్ చేశాడు తారక్ అంటూ తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి..!!