సమంత – బాలయ్య కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఇదే.. సెట్ అయ్యుంటే చరిత్ర తిరగరాసుండేది..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. అది హీరో హీరోయిన్ పాత్ర కావచ్చు .. హీరో విలన్ పాత్ర కావచ్చు .. హీరో సిస్టర్ పాత్ర కావచ్చు.. కొన్నిసార్లు అలాంటి పాత్రలు మిస్ చేసుకుని చాలా చాలా బాధపడుతూ ఉంటారు నటీనటులు. అయితే సినిమా ఇండస్ట్రీలో అలాంటి క్రేజీ కాంబోలో ఎన్నో మిస్సయ్యాయి . కాగా రీసెంట్ గా దానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా ఇండస్ట్రీలో పిచ్చెక్కించే కాంబో అనగానే అందరికీ గుర్తొచ్చేది సమంత – బాలయ్య. వీళ్ళిద్దరి పేర్లు చెప్పగానే ఫాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు ఈ ఇద్దరు . వీళ్లిద్దరి కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉండింది . అయితే ఆ సినిమాను సమంతనే రిజెక్ట్ చేసిందట. ఆ సినిమా మరేదో కాదు వీరసింహారెడ్డి . ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర కోసం ముందుగా చాలామంది హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యారట గోపీచంద్ మలినేని.

అందులో సమంత , హీరోయిన్ సాయి పల్లవి – కృతి శెట్టి లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారట . కానీ వాళ్ళు ఎవరు ఈ పాత్రను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఫైనల్లీ ఈ పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ చేతికి వెళ్ళింది. సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకునేలా చేసింది. ఈ పాత్రకు ఆమె తప్పిస్తే మరి ఎవరు సూట్ కారు అని చెప్పడంలో సందేహం లేదు..!!