సడన్గా ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించడానికి కారణం ఇదే.. జగన్ స్కెచ్ అదిరిపోలా..!

మనకు తెలిసిందే.. సంక్రాంతి సెలవలను ఏపీ ప్రభుత్వం పొడిగించింది.  జనవరి 21 ఆదివారంతో కలిపి మొత్తం మూడు రోజులు సెలవులు పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో జనవరి 18న తెచ్చుకోవాల్సిన పాఠశాలలు జనవరి 22 న తిరిగి తెరుచుకోనున్నాయి.  తల్లిదండ్రులు విజ్ఞప్తిని పరిగణలో తీసుకొని సంక్రాంతి సెలవులను పొడిగించినట్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ..దాని వెనకాల ఏదో పెద్ద రీజన్ ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

అయితే ఆడుదాం ఆంధ్ర కోసం సెలవులను పొడిగించినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా జనవరి 10న ప్రారంభమైన మండల స్థాయి ఆటల పోటీలు జనవరి 20 తో ముగియనున్నాయి. క్రికెట్, ఖోఖో, కబడ్డి చాలా మండలాలలో ప్రభుత్వ బడులకు అనుబంధంగా క్రీడా మైదానాలలో పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్నారు .

ఒకవేళ స్కూలు తెరిస్తే పోటీలకు ఇబ్బంది కలుగుతుంది అని భావించిన ఏపీ ప్రభుత్వం ఉన్నత అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఏపీలోని అన్ని స్కూళ్లకు 10 రోజులపాటు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే . ఇప్పుడు ఆ సెలవులను మరో మూడు రోజులు పొడిగించింది ఏపీ ప్రభుత్వం . తిరిగి స్కూల్లు జనవరి 22న పునః ప్రారంభం కానున్నాయి.