మన ఆధార్ మనమే అప్డేట్ చేసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రాసెస్ ఏంటంటే..(వీడియో)?

మనం ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం కావాలన్నా.. లేదా మ‌న‌కు స‌రైన గుర్తింపు చూపించాల‌న్నా.. ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అదే ఆధార్ కార్డులో ఏదైనా చిన్న మిస్టేక్ ఉందంటే ఆ పని కోసం గవర్నమెంట్ ఆఫీసులో చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తుంది. ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా కూడా.. మీ సేవ లేదా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి ఆఫీసులో బయట నిలబడాల్సి వస్తుంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం ఇకపై ఇలాంటి సమస్యలు లేకుండా మన ఆధార్ ను మనమే స్వయంగా స్మార్ట్ ఫోన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చట. ఇంతకీ ఆ ప్రాసెస్ ఏంటో ఎలా మన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు ఓసారి చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని టైప్ చేసుకోవాలి.

ఐపిపిబి కస్టమర్ అని వస్తోంది.. దాని పై క్లిక్ చేస్తే ఆధార్ మొబైల్ అప్డేట్ అని చూపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకుని దాంట్లో కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు ఆధార్ అప్డేట్ అవుతుంది. మొబైల్ లోనే ఆధార్ కార్డ్‌ డౌన్లోడ్ చేసుకుని అవసరమైనప్పుడు ప్రింట్ చేయించుకోవచ్చు

 

 

View this post on Instagram

 

A post shared by thetechdroid (@thetechdroidofficial)