చిరంజీవి హీరో కాదు విలన్.. సీనియర్ హీరోయిన్ సుహాసిని సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని మాణిరత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై సందడి చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుహాసిని.. మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాళీ.. అనే తమిళ్ మూవీ లో చిరంజీవి నటించారు. నేను ఆ మూవీకి కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేశా.. నాకు అప్పుడే కొత్తగా పెళ్లయింది.

ఓ రోజు షూటింగ్ బ్రేక్ టైం లో మెగాస్టార్ ఓ మూలన కూర్చుని ఉన్నారు ఏంటి అతను అక్కడ అలా కూర్చున్నారని ఎవ‌రినో అడిగాను.. ఆయన తెలుగు అయన. తమిళ్ మాట్లాడటం పెద్దగా రాదు. గ్రేట్ యాక్టర్.. అప్‌క‌మింగ్ స్టార్.. ఇక్కడ కమల్ హాసన్ ఎలాగో టాలీవుడ్ లో ఆయన అలాగే అంటూ వివరించారు. ఆయన చూడడానికి విలన్‌లా ఉన్నారు.. హీరోనా అంటూ ఆశ్చర్యపోయా.. ఆ విషయం మెగాస్టార్ దాకా వెళ్ళింది అంటూ వివ‌రించింది.

తర్వాత రోజు షూట్లో ఆయన నన్ను విలన్‌తో ఎవరైనా నటిస్తారా అంటూ సరదాగా ఆట పట్టించారు.. నువ్వు హీరోయిన్, నేను విలన్ అనేవారు. వెంటనే సారీ చెప్పా.. అలా మా పరిచయం స్టార్ట్ అయింది.. తర్వాత చిరు నెక్స్ట్ మూవీ మహారాజులో నాకు ఛాన్స్ వచ్చింది.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది అంటూ వివ‌రించింది. ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి గారిలాంటి గొప్ప మనసు ఎవరికీ ఉండదు అంటూ సుహాసిని వివరించింది. ప్రస్తుతం సుహాసిని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.