పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మీసం మెలి వేసే న్యూస్.. పవర్ స్టార్ కి అరుదైన గౌరవం..!!

ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మీసం మెలి వేసే న్యూస్ అని చెప్పాలి . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరుకి సినిమా ఇండస్ట్రీలో ఎలా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ప్రెసెంట్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో బిజీగా ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ కు ఏదైనా గౌరవం దక్కింది. ఉత్తరప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలి అంటూ పవన్ కళ్యాణ్ కు స్పెషల్గా ఆహ్వానం అందింది.

ఈ మేరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క్ ప్రముఖ ముళ్ళపూడి జగన్ ఆహ్వాన పత్రికను పవన్ కళ్యాణ్ కు అందించారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఈనెల 22వ తేదీ అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికోసం విదేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరు కాబోతున్నారు . ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందడం పవన్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తుంది .

శ్రీరామ జన్మభూమి తీర్థక్ష ట్రస్ట్ ప్రముఖులకు ఇన్విటేషన్ పంపుతుంది. అలాంటి వేడుకకు రావాలని పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపడం అరుదైన గౌరవంగా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సినీ ఇండస్ట్రీ నుంచి కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ , పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఆహ్వానం అందడం గమనార్హం..!!