హనుమాన్ ని తొక్కేస్తున్న ఆ నాలుగు సినిమాలు… విజయం ఎవరిది..?

ప్రస్తుతం రానున్న సంక్రాంతి పండగ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే లాగే కనిపిస్తుంది. పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమా గా రాబోతున్న హనుమాన్ ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా చాలా బలంగా హనుమాన్ ని ప్రేక్షకులలోకి తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు అడ్డుకట్టులు ఎదురవుతూనే ఉన్నాయి.

అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి రిలీజ్ డేట్ మార్చుకోమని ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయంటూ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు ప్రశాంత్ వర్మ. నైజాంలో ఎంతగా మైత్రి వారి హనుమాన్ ని రిలీజ్ చేస్తున్న.. హైదరాబాద్లో హనుమాన్ కి కేవలం 4 థియేటర్లు ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చ నియాంసమయింది. తెలుగు రాష్ట్రాలలో రెండు పెద్ద సిటీలు ఆయన హైదరాబాద్ సిటీలో నాలుగు థియేటర్స్ మాత్రమే కేటాయిస్తూ.. వైజాగ్ లో ఒక థియేటర్ కూడా ఇవ్వలేదు.

చిన్న సినిమాకి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి ఇది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక జనవరి 12న గుంటూరు కారంతో పోటీ పడునున్న హనుమాన్.. 13న సైంధవ్, ఈగిల్ తో ఢీ కొట్టనున్నాడు. ఇక అనంతరం జనవరి 14న నాగార్జున హీరోగా నటించిన ” నా సామి రంగ ” మూవీని ఢీ కొట్టాలి. హనుమాన్ కంటే మిగతా నాలుగు సినిమాలు ఏ మాత్రం పాజిటివ్ టాక్ దక్కించుకున్న హనుమాన్ కి థియేటర్లు కరువవుతాయనే చెప్పాలి. మరి హనుమాన్ మూవీ ఈ నాలుగు సినిమాలని తొక్కేస్తుందో.. లేదా ఈ నాలుగు సినిమాలు కలిపి హనుమాన్ ని తొక్కేస్తాయో చూడాలి మరి.