అయోధ్య రామ ప్రతిష్ట సమయంలోనే ప్రసవించిన ముస్లిం మహిళ.. బిడ్డకు రాముడి పేరు..

ఒక మ‌తాని మ‌రొక‌రు వ్యాఖ్యలు చేసుకునే స్థాయి నుంచి పరమత సహనం అనే స్థాయికి భారతదేశం ప్రస్తుతం ఎదుగుతుంది. విశ్వ గురువుగా చెప్పుకోదగిన దేశంగా భారతదేశం మారబోతుంది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిని చాలామంది ముస్లిములు స్వాగతించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు వేడుకను చూసి ఆనందించారు. మసీదులకు సంబంధించిన కొంతమంది మౌలాలీలు అయోధ్యకు వెళ్లి మరి రాముడి ఆలయ ప్రారంభం, బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను దర్శించుకుని సంతృప్తి చెందారు.

Born on Ram temple inauguration day, Muslim boy named 'Ram ...

కొంతమంది ముస్లింలు హైదరాబాద్ లోని పాతబస్తీ లాంటి ప్రదేశాలలో మిఠాయిలు పంచారు, అన్నదానాలు కూడా చేశారు. ఇంకొన్ని చోట్ల హిందువులతో కలిసి అక్షింతలు పంపిణీ చేశారు. ఇలాంటి దృశ్యాలు భారత్‌లో పరమత సహనం ఉంది అని చెప్పడానికి సంకేతాలని ప‌లువురు నాయకులు వెల్లడించారు. ఇక పరమ‌త సహనం పెరిగిపోయిందని చెప్పడానికి బలం చేకూర్చే సంఘటన ఇది అంటూ వివరించారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో సోమవారం రాముడి ఆలయంలో బలరాముని ప్రతిష్ట.. నరేంద్ర మోడీ చేతుల మీదగా ఘనంగా జరిగింది. అయితే ఈ విగ్రహ ప్రతిష్ట సమయంలోనే సరిగా ఓ ముస్లిం గర్బిని ప్రసవించింది.

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ ఆసుపత్రిలో సదరు గర్భిణి ప్రసవ నిమిత్తం ఆసుపత్రికి చేరింది సరిగ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలరాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలోనే ఆమె ప్రస‌వించింది. అయితే రాముడు విగ్రహ ప్రతిష్టాపన సమయంలోనే భార్య ప్రశించడంతో ఆ బిడ్డకు.. భర్త రామ్ రహీం అని రాముల వారి పేరే పెట్టుకున్నాడు. రాముడి పేరే ఆ బాబుకు పెట్టడంతో ముస్లింలు, హిందువుల మధ్య ఐక్యత పెరిగిందని మతాలు వేరైనా మనుషులంతా ఒకటే అనే స్ఫూర్తి ప్రదర్శించేలా తమ బిడ్డకు ఆ పేరు పెట్టామని తండ్రి వివరించాడు.

రాముడు విగ్రహ ప్రతిష్ట సమయంలోనే తనకు మనవడు పుట్టడంతో రెండు మతాలవారు ఐక్యంగా ఉండేలా రామ్ రహీం అనే పేరు పెట్టుకున్నాడని ఆ బాబు భామ హుస్నాబాను వివరించింది. రామ్ రహీమ్ అని తండ్రి పెట్టిన పేరుని నేను కూడా స్వాగతిస్తున్నానని వివరించింది. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి మీడియా వరకు వెళ‌డంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో అందరూ బాబును చూడడానికి ఆసక్తి చూపుతున్నారంటూ బాబు బామ్మ మురిసిపోతుంది.