“ఇదే క్వశ్చన్ పెద్ద హీరోలను అడిగే దమ్ము మీకు ఉందా…?”.. రిపోర్టర్ కు 90MM రాడ్ దించేసిన తేజ..!

ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి ఇప్పుడు హీరోలుగా మారుతున్న లిస్ట్ పెరిగిపోతుంది . ఆ జాబితాలోకి వస్తాడు తేజ సజ్జా. ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తేజ ఆ తర్వాత పలువురి హీరోల సినిమాలో కూడా నటించాడు . పెద్దయిన తర్వాత హీరోగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు . రీసెంట్గా తేజ సజ్జా నటించిన సినిమా హనుమాన్ . కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది .

ప్రశాంత్ వర్మతో కలిసి తేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఇది ఓ సూపర్ హిట్ కాంబో గా మారిపోయింది . తేజ నటించిన హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉండడం గమనార్హం . కాగా హనుమాన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై ఫుల్ హైప్స్ పెంచేసుకున్నారు జనాలు .

అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ లో మీడియా రిపోర్టర్ తేజను ప్రశ్నించిన తీరు ఆయనకు అస్సలు నచ్చలేదు. అందుకే వెంటనే ఫటాఫట్ అంటూ కౌంటర్ వేసేసాడు . “హనుమాన్ ట్రైలర్ బాగుంది స్కేల్ చాలా పెద్దగా ఉంది ..ఈ స్కేల్లో మిమ్మల్ని చూస్తే కాస్త ఎక్కువగా ఉంది . మీకు ఇది సరిపోతుందా..?” అని అర్థం వచ్చేలా కూసింత ఘాటుగా ప్రశ్నించారు సీనియర్ రిపోర్టర్. దీంతో తేజకు కోపం వచ్చింది . వెంటనే మైక్ తీసుకొని..” ఈమధ్య వచ్చిన టైర్ 2 హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసినప్పుడు ఇదే క్వశ్చన్ మీరు వాళ్ళని అడిగారా..? నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి కష్టపడి సోలో హీరోగా సినిమాలు చేసుకుంటూ బయట డైరెక్టర్ తో సినిమాలు కూడా చేసుకుని ప్రాజెక్ట్ లు చేస్తుంటే నన్ను అడుగుతున్నారు ఇది న్యాయమేనా ..?”అన్న విధంగా ఆన్సర్ ఇచ్చాడు .

అంతేకాదు అందరూ తేజకే సపోర్ట్ చేస్తున్నారు జనాలు. ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పక్కన పెడితే కంటెంట్ ఉన్న సినిమాలను చేయడంలో తేజ చాలా ముందు వరుసలో ఉన్నాడని ..ఆయన ఎంకరేజ్ చేయండి తప్పిస్తే డీ గ్రేడ్ చేయొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!