‘ యానిమల్ ‘ మెషిన్ గన్ తయారీ వెనుక ఇంత కథ నడిచిందా..?!

భారత్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు కొల్లగొట్టిన 10 సినిమాల జాబితాలో యానిమల్ కూడా ఒక‌టి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.835.8 కోట్ల రాబట్టి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో రణ్‌బీర్‌ ర్ మెషిన్ గాన్‌ ఉపయోగించే సీన్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మిషన్ గాని ఎలా తయారు చేశారనే ప్రశ్న అందరిలో మొదలైంది. కొందరు ఇది నిజమైన మిషన్ గాన్‌ కాదు, గ్రాఫిక్స్ లో తయారు చేశారు.. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ యూజ్‌ చేశారు అని భావించారు. అయితే ఈ మిషన్ గ‌న్ నిజంగానే తయారు చేసినట్లు యూనిట్ చెప్తుంది.

మిషన్ గన్‌ గురించే ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ మీడియాతో మాట్లాడుతూ ఈ మెషిన్ స్టీల్ తో తయారు చేయబడిందని.. దీని తయారీకి ఐదు నెలలు పట్టిందని వివరించాడు. దీన్ని తయారు చేయడానికి వందల మంది కష్టపడ్డారని.. 500 కిలోల స్టీల్ వాడమని చెప్పుకొచ్చాడు. ఈ గన్ తయారు చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన ఆ సన్నివేశాలు అందరినీ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటాయని అసలు ఊహించలేదని వివ‌రించాడు.

డైరెక్టర్ సందీప్ ఆలోచనలకు అనుగుణంగా ఈ గన్ తయారు చేశామని మొదట సందీప్ పెద్ద మెషిన్ గురించి వివరించాడని.. అంత భారీగా తయారు చేయడానికి నాలుగు, ఐదు నెలలు పడుతుంది అని చెప్పానని మిషన్ గాన్‌ తయారీలో ఎంతో శ్రద్ధ వహించి వినూత్నంగా తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డాం అంటూ ఆ మిషన్ గాన్‌ బరువు 500 కిలోలని సురేష్ వివరించాడు. ఇక దీని తయారీకి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చయిందట.