వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 క్రికెట‌ర్లు వీళ్లే…!

భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభం అయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అహాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభమై…. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత్ 1983,2011 లలో రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచింది. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

సచిన్ టెండూల్కర్:
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో భారత్ జట్టు మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టాప్ వన్ లో ఉన్నాడు. 44 ఇన్నింగ్స్ లలో, 6 సెంచరీలు, 15 అర్థ సెంచరీలతో 2278 పరుగులతో..‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

రికీ పాంటింగ్:
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. 42 ఇన్నింగ్స్ లలో 5 సెంచరీలు, 6 అర్థ సెంచరీలతో 1743 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

కుమార సంగక్కర:
శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగక్కర.. 35 ఇన్నింగ్స్ లలో 5 సెంచరీలు, 7 అర్థ సెంచరీలతో 1532 రన్స్ చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

బ్రియన్ లారా:
వెస్టిండీస్ మాజీ దిగ్గజం బ్రియాన్ లారా.. 33 ఇన్నింగ్స్ లలో, 2 సెంచరీలు, 7 అర్థ సెంచరీలతో..1225 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.

ఏబీ డివిలియర్స్:
దక్షిణాఫ్రికా కీపర్ బ్యాట్స్ మాన్ ఏబీ డివిలియర్స్… 22 ఇన్నింగ్స్ లలో, 4 సెంచరీలు, 6 అర్థ సెంచరీలతో 1207 రన్స్ చేసి ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.