అమెరికాలో ఉండే భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా..?

ఇటీవల కాలంలో లైఫ్‌లో సెట్టిల్‌ అవ్వాలంటే విదేశాలకు వెళ్లాలని ఫిక్స్ అయి చదువుకున్న వారంతా అమెరికాకు వెళ్లడానికి ఎక్కువగా మగ్గుచూపుతున్నారు. వందలో 90 శాతం గ్రాడ్యుయేట్స్ అంతా అమెరికా వెళ్ళింది ప్రయత్నిస్తున్నారు. ఇక అలా ఎప్పటికప్పుడు ఏడాది ఏడాదికి మన భారతదేశం నుంచి అమెరికా వెళ్లే వారి జనాభా అధికంగా ఉంటుంది.

ఇక ఈ నేపద్యంలో 2020 నాటికి జాతుల వారీగా సమగ్ర జనాభా లెక్కల వివరాలను అమెరికా ప్రభుత్వం పరిధిలో యుఎస్ సెన్సెస్ బ్యూరో ఈ గురువారం రిలీజ్ చేసింది. ఈ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 22 నాటికి అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏడాది ఏడాదికి పెరుగుతూ ప్రస్తుతం 47 లక్షల మంది భారతీయులు ఉన్నారని జనాభా లెక్కలు పేర్కొన్నాయి. ఈ లెక్కల ప్రకారం అమెరికాలో నివాసం ఉంటున్న జాబితాలో 52 లక్షల మంది చేనీయులు కూడా ఉన్నారు. చైనా జ‌నాభ తోలిస్థ‌నంలో ఉండడం గమనార్హం.