హీరో శర్వానంద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చిన శర్వానంద్.. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకుని మోస్ట్ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన తన 35వ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శర్వాకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అన్నట్లు శర్వానంద్ కొద్ది నెలల క్రితమే ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డిని శర్వా వివాహం చేసుకున్నాడు. రక్షితా రెడ్డి పక్కన పెడితే శర్వానంద్ గతంలో పెళ్లైన ఓ స్టార్ సింగర్ ను ప్రేమించాడనే టాక్ ఉంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు స్మిత. సింగర్ గానే కాకుండా నటిగా, వ్యాపారవేత్తగానూ స్మితకు మంచి పేరుంది. అయితే హీరోగా మంచి పొజీషన్‌లోకి వెళ్తున్న సమయంలో శర్వానంద్ కు ఓ సినిమా ఈవెంట్ లో స్మిత పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది.
కానీ, అప్పటికే స్మితకు శశాంక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయినప్పటికీ శర్వానంద్ తో క్లోజ్ గా ఉంటూ.. భర్తను దూరం పెట్టింది. ఒకానొక సమయంలో భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంది. శర్వానంద్ కూడా స్మితకు రెండో భర్తగా వెళ్లాలనుకున్నాడు. అయితే స్మితను వదులుకునేందుకు శశాంక్ ఒప్పుకోలేదు. అప్పుడే ఇండస్ట్రీ పెద్దలైన నాగేశ్వరరావు, నాగార్జున, దాసరి నారాయణరావు వంటి పెద్దలతో పంచాయితీ పెట్టించేశాడు. మంచి భర్తను, బంగారం లాంటి జీవితాన్ని కాలదన్నుకుంటున్నావు అంటూ స్మితకు ఇండస్ట్రీ పెద్దలు బ్రెయిన్ వాష్ చేశారు. దాంతో తప్పు తెలుసుకున్న స్మిత.. శర్వాకు బ్రేకప్ చెప్పి భర్తతో మళ్లీ హ్యాపీ లైఫ్ ను స్టార్ట్ చేసిందనే టాక్ ఉంది. ఇక స్మితతో బ్రేకప్ తర్వాత ప్రేమ జోలికి వెళ్లని శర్వా.. కెరీర్ పైనే ఫోకస్ పెట్టాడు.