పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ యాక్ట్రెస్.. పేరు ఏం పెట్టిందంటే….

బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ మనందరికీ సుపరిచితురాలే. ఈమె బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులు షేర్ చేసింది. గతంలో తను తల్లి కాబోతున్నానంటూ శుభవార్తను షేర్ చేసిన స్వర భాస్కర్ తాజాగా తనకు ఆడపిల్ల పుట్టిందంటూ మరో పోస్ట్ పెట్టింది.  ఈ సందర్భంగా తన భర్త ఫాహద్ అహ్మద్ పాప తో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

స్వరా భాస్కర్ ఈ నెల 23 న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలానే ఆ పాప కు ‘రుబియా’ అనే పేరు పెడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించింది. ఈ సందర్బంగా ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు స్వరా, ఫాహద్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంతమంది స్పెషల్ గా పోస్ట్ లు కూడా పెడుతున్నారు. స్వరా భర్త ఫాహద్ అహ్మద్ సమాజ్ వాది పార్టీ నేత.విరిద్దరూ సీక్రెట్ గా ఒకసారి పెళ్లి చేసుకున్నారు.

2023 జనవరి 6 న విరిద్దరి వివాహం జరిగింది. అయితే మొదట విరిద్దరూ కోర్ట్ ద్వారా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత మార్చి లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత మార్చి లోనే స్వరా తను తల్లి కాభోతున్నట్లు  ప్రకటించింది. అప్పుడే బేబీ బంప్ పొట్టతో దిగిన ఫోటోలను ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ‘ కొన్ని సార్లు మన ప్రార్ధనలు అన్ని ఫలిస్తాయి. భగవంతుడు మన ప్రార్ధనలకు సమాధానం చెప్తాడు. ఇది మాకొక కొత్త అనుభూతి . మేము చాలా ఎగ్స్టెడ్ గా ఉన్నాము.  అక్టోబర్ లో మా బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం’ అంటూ ప్రకటించింది.