తిరుపతిలో టీడీపీకి జనసేన షాక్..మళ్ళీ భూమనదే హవా.!

గత ఎన్నికల్లో టి‌డి‌పికి వైసీపీ కొట్టిన దెబ్బ కొట్టి..జనసేన సైలెంట్ గా కొట్టిన దెబ్బ పెద్దదనే చెప్పాలి. ఎందుకంటే జనసేన భారీగా ఓట్లు చీల్చి టి‌డి‌పిని ఓడించింది. అలాగే వైసీపీని గెలిపించింది. దాదాపు 50 నియోజకవర్గాల పైనే జనసేన ప్రభావం పడింది. అయితే ఈ సారి ఆ నష్టం జరగకూడదని చంద్రబాబు-పవన్ కలుస్తున్నారు. ఇక కలిసిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కలవకపోతే జరిగే నష్టం ఏంటో తెలిసిందే.

అయితే పొత్తు వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు వస్తాయి. అలాగే జనసేన తీసుకునే సీట్లలో టి‌డి‌పి ఓట్లు పూర్తిగా బదిలీ కావడం కష్టం. తాజాగా తిరుపతిలో టి‌డి‌పికి జనసేన షాక్ ఇచ్చేలా ఉంది. అక్కడ జనసేన అభ్యర్ధిగా పసుపులేటి హరిప్రసాద్‌కు సీటు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇక టి‌డి‌పితో పొత్తు ఉన్నా సరే ఈ సీటు తమకే అని జనసేన శ్రేణులు అంటున్నాయి.

దీంతో టి‌డి‌పి అయోమయంలో ఉంది. ఒకవేళ పొత్తు లేకపోయిన ఓట్లు చీలిపోయి టి‌డి‌పికే నష్టం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి..708 ఓట్ల తేడాతో టి‌డి‌పిపై గెలిచారు. అంటేచాలా స్వల్ప మెజారిటీ. అదే సమయంలో అక్కడ జనసేనకు 12 వేల ఓట్లు పడ్డాయి. అదే టి‌డి‌పి-జనసేన కలిసి ఉంటే వైసీపీ గెలిచేది కాదు.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పొత్తు ఉంటే ఈ సీటు తామే తీసుకుంటామని జనసేన శ్రేణులు అంటున్నాయి. అంటే ఎటు చూసుకున్న టి‌డి‌పికి దెబ్బ పడేలా ఉంది. ఇక పొత్తులో భాగంగా జనసేనకు సీటు ఇస్తే..ఇక్కడ ఉన్న టి‌డి‌పి ఓట్లు పూర్తిగా జనసేనకు బదిలీ కావు. దీని వల్ల వైసీపీకే లాభం. పొత్తు ఉన్నా లేకపోయిన్న ఇక్కడ మళ్ళీ భూమన హవా నడిచేలా ఉంది.