జాన్వీ మామూల్ది కాదు.. ఎంట్రీ కోసం `ఎన్టీఆర్ 30`నే ఎందుకు సెలెక్ట్ చేసుకుందో తెలుసా?

దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. అదే `ఎన్టీఆర్ 30`. యువసుధ‌ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్ల‌బోతుంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ క‌పూర్ ను ఎంపిక చేశారు.

నిన్న జాన్వీ క‌పూర్ బ‌ర్త్‌డే సందర్భంగా.. `ఎన్టీఆర్ 30` నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను బయటకు వ‌ద‌ల‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే జాన్వీ కపూర్ కు ఇంతకుముందు సౌత్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా.. ఆమె నో చెప్పింది. కానీ, తన ఎంట్రీ కోసం `ఎన్టీఆర్ 30`నే ఎందుకు సెలెక్ట్ చేసుకుందో తెలిస్తే జాన్వీ మామూల్ది కాదని అనకుండా ఉండలేరు.

ఎన్టీఆర్ 30లో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందట. కేవలం గ్లామర్ షోకే పరిమితం చేయకుండా కొరటాల హీరోయిన్ పాత్రను చక్కగా తీర్చిదిద్దాడ‌ట. పైగా ఎన్టీఆర్ 30ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. అలాగే ఆర్‌ఆర్ఆర్‌ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులారిటీని సంపాదించుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ మూవీ అని జాన్వీ భావించిందట. అందుకే వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పిందట. ఇకపోతే ఈ మూవీకి జాన్వీ కపూర్ ఏకంగా రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్.

Share post:

Latest