“ఏవడైతే నాకేంట్రా”..టంగ్ స్లిప్ అయిన స్టార్ డైరెక్టర్..మరోసారి పెంట పెంట చేసేసాడుగా..!!

గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో.. డైరెక్టర్ వెంకటేష్ మహా పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలుస్. ఇన్నాళ్లు సైలెంట్ డైరెక్టర్ అనుకున్న ఈయన లో ఇంత వైల్డ్ యాంగిల్ కూడా ఉందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఏకంగా కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ..హీరో యాష్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన వెంకటేష్ మహా తర్వాత అంతటి పాపులారిటీ తెచ్చుకుంది మాత్రం ఈ కామెంట్స్ చేసే అని చెప్పాలి.

kgf2
kgf2

రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ మహా.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. హీరో యాష్ పై సంచలన కామెంట్స్ చేశారు. వాళ్ళు వాళ్లు తెరకెక్కించిన కే జి ఎఫ్ సిరీస్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేయడమే కాకుండా ..ఇబ్బందికర లాంగ్వేజ్ ని యూస్ చేశారు . ఈ క్రమంలోనే కన్నడ ఫాన్స్ ఫైర్ అయ్యారు. ముందు వాళ్లకు క్షమాపణలు చెప్పు అంటూ డిమాండ్ చేస్తున్నారు . లేకపోతే నీ సినిమాలు బాయ్ కాట్ చేస్తామని,, నీకు లైఫ్ లేకుండా చేస్తామంటూ ఓపెన్ గానే సవాల్ విసిరుతున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ మహా ఓ వీడియోని రిలీజ్ చేశారు .

కాగా ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ ..”నేను మాట్లాడిన మాటలు తప్పు అని అనుకోవడం లేదు ..ఎందుకంటే కేజీఎఫ్ సినిమా నచ్చని ఎంతోమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు . మీరు చెప్పింది కరెక్టే అంటూ ఎంతో మంది నన్ను అప్రిషియేట్ చేశారు . బహుశా నేను మాట్లాడిన పద్ధతి మీకు నచ్చకపోయి ఉండొచ్చు.. అలాంటి లాంగ్వేజ్ యూస్ చేసినందుకు సారీ ..కానీ నేను చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్ ..ఎంతోమందికి కేజిఎఫ్ సినిమా నచ్చలేదు ” అంటూ ఘాటుగా స్పందించారు .

 

ఈ క్రమంలోనే తాను చేసిన తప్పును మరోసారి సమర్ధించుకోవడానికి ట్రై చేశాడు ..వెంకటేష్ మహా అంటూ పలువురు ఆయనపై మండిపడుతున్నారు. అంతేనా ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తుంటే ఎదుటివాడు ఎవడైతే నాకేంటి అన్న రేంజ్ లో ఉంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ మారింది. అయితే ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మరో డైరెక్టర్ నందినీ రెడ్డి అభిమానులకు క్షమాపణలు చెప్పారు . ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు నవ్వినందుకు సారీ అంటూ ఓపెన్ గానే చెప్పకు వచ్చేసారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ మహా VS ప్రశాంత్ నీల్ వార్ హై రేంజ్ లో కొనసాగుతుంది..!!