ఆత్మహత్యను వదిలి జీవితాన్ని గెలిచిన స్టార్స్ వెళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులు సైతం ఒకానొక సందర్భంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అలా ఇబ్బందులు ఎదుర్కొన్న కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట కానీ.. ఆత్మహత్య నుంచి బయటపడి సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు వాటి గురించి తెలుసుకుందాం.

ఇలియానా:
ఇలియానా నవంబర్ 1-1986న ముంబైలో జన్మించారు. ఈమె మన తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. 12 ఏళ్ల వయసులో ఆత్మహత్య ఆలోచన వచ్చిందని ఇలియానా తెలిపింది..

పవన్ కళ్యాణ్:
తెలుగు సినీహీరో, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్.. అయితే డిప్రెషన్ తో లోనయి ఆత్మహత్యా ప్రయత్నం చేశానని పవన్ తెలియజేశారు.

నాగబాబు:
మెగా బ్రదర్ నాగేంద్రబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు, నిర్మాత. ఏన్నో సినిమాల్లో సహాయ నటుడిగా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అజంతా ప్రొడక్షన్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట నాగబాబు..

మృణాల్ ఠాకూర్:
సీతారామం చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్.. 2012లో “ముజ్ సే కుచ్ కెహెతి”.. యే కామోషియన్’అనే టీవీ సీరియల్ ద్వారా కెరియర్ ప్రారంభించింది. తన మొదటి సినిమా వట్టిదండు తో సినీ నటిగా అరంగేట్రం చేసింది. అయితే మృణాల్ ఠాకూర్ ఒకానొక సమయంలో రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందట..

దీపికా పడుకో
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. 2018లో నటుడు రణ్ వీర్ సింగ్ ని వివాహమాడింది. అయితే ఈ దీపికా పడుకునే గతంలో లవ్ ఫెయిల్యూర్ వల్ల..డిప్రెషన్ కి వెళ్లి సూసైడ్ చేసుకోవాలని అనుకుందట..

అబ్బాస్:
టాలీవుడ్లో అబ్బాస్ హీరో గా గతంలో మంచి పేరు సంపాదించారు. అబ్బాస్ తెలుగు, మలయాళ, కన్నడ,తమిళ, చిత్రాలలో నటించారు. వినీత్ కలసి నటించిన ప్రేమ దేశం సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.. అయితే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని హీరో అబ్బాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..

వీరంతా ఆత్మహత్యను వీడి కెరియర్ లో మంచి విజయాన్ని సాధించారు.