`సైంధవ్`గా వెంకటేష్.. సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్‌గా టైటిల్ గ్లింప్స్!

టాలీవుడ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, హిట్ ఫేమ్ శైలేష్‌ కొలను కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వెంకీ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 75వ చిత్ర‌మిది. అయితే ల్యాండ్ మార్క్ మూవీకి `సైంధవ్` అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన టైటిల్ గ్లింప్స్ సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ గా సాగుతూ విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ గ్లింప్స్ స్టార్టింగ్ లో వెంకటేష్ నడుచుకుంటూ వెళ్లి.. బైక్ మీద ఉన్న బాక్స్ లో నుంచి కెమికల్ బాంబు ఒకటి తీసి చూస్తాడు. ఆ తరువాత వెపన్స్ ఉన్న కంటైనర్ లోకి వెళ్లి గన్ తీసుకోని బయటకి వచ్చి బైక్ మీద కూర్చొని `నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళాను, రమ్మను` అని ముందు కొట్టిపడేసిన రౌడీలకు చెబుతాడు.

అలాగే టైటిల్ గ్లింప్స్ లో వెంకీ లుక్‌ నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉండటం విశేషం. మొత్తానికి ఈ గ్లింప్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథతో సినిమా ఉండనుంది. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నాడు.

Share post:

Latest