వైసీపీ కంచుకోటలో టీడీపీ దూకుడు..30 ఏళ్ల తర్వాత!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట గానే ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో 14కి 14 సీట్లని వైసీపీ గెలుచుకుంది. కానీ ఎన్నికల తర్వాత నిదానంగా జిల్లాలో పరిస్తితి మారుతూ వస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది. ఇదే సమయంలో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న కొన్ని స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది. అసలు టీడీపీకి ఏ మాత్రం బలం లేని కోడుమూరు స్థానంలో ఇప్పుడు పరిస్తితి మారుతుంది.

అసలు ఈ స్థానంలో టీడీపీ గెలిచింది కేవలం ఒక్కసారి మాత్రమే. అది కూడా 1985లో..ఆ తర్వాత మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. అంటే కోడుమూరులో టీడీపీకి బలం లేదని సంగతి తెలుస్తోంది. ఇక్కడ ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలవగా, గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జరదొడ్డి సుధాకర్ దాదాపు 36 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇంత భారీ మెజారిటీతో గెలిచిన సుధాకర్..అనుకున్న స్థాయిలో పనిచేయడంలో విఫలమవుతున్నారు. అభివృద్ధి చాలా తక్కువ. ఏదో ప్రభుత్వం నుంచి పథకాలు కాస్త ప్లస్. అయితే నియోజకవర్గంలో పలు అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఇదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచే ఎమ్మెల్యే వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సోదరుడు సుదర్శన్ వైసీపీని వీడి, టీడీపీలో చేరిపోయారు. తన సోదరుడు సుధాకర్…తనని గెలిపించిన వారినే మోసం చేశారని, నెక్స్ట్ ఎన్నికల్లో సుధాకర్‌ని ఓడించి తీరాలని చెప్పి టీడీపీలో చేరామని అంటున్నారు.

కోడుమూరు బాధ్యతలని విష్ణువర్ధన్ రెడ్డి సమర్ధవంతంగా చూసుకుంటున్నారు..అటు ఆకెపోగు ప్రభాకర్ సైతం ఇంచార్జ్‌గా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల వస్తున్న సర్వేలు చూసుకుంటే కోడుమూరులో టీడీపీ బలం పెరిగిందని తెలుస్తోంది. కాకపోతే 1.25 శాతం స్వల్ప లీడ్ లో వైసీపీ ఉందని తెలిసింది. అయితే టీడీపీ ఇంకాస్త కష్టపడితే 30 ఏళ్ల తర్వాత కోడుమూరులో గెలిచే ఛాన్స్ ఉంటుంది.