మహేష్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్..ssmb 28 లీక్‌డ్ పిక్ వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా నిన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సినిమాకు ssmb 28 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందో లేదో ఓ ఆన్ లొకేషన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మహేష్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లీక్ అయిన పిక్ లో మహేష్ ఫేస్ మాత్రం రివిల్ కాలేదు. అయినా వెనుక నుంచి చూసినా.. మహేష్ ఈ సినిమాలో ఏంతో సాలిడ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో మహేష్ తో పాటు సాయి రోనాక్ అనే యువ హీరో కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. మహేష్ పుట్టినరోజు కానుకంగా ఆగస్టు 11 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోకేషన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.