తారక్ ని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా..వెరీ ఫన్నీ..!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎన్టీఆర్ కు ఎందరో అభిమానులు ఉన్నారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ కొడుకుగా చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. అతి తక్కువ సమయంలోనే తన నటనతో తన అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఎన్టీఆర్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఎందరో ఉన్నారు. ఎన్టీఆర్ నటన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో తన నటనను ఖండంతరాలు దాటి చూపించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాస్ దర్శకుడు కొరటాల శివతో తన 30వ‌ సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది.

అది ఏమిటంటే ఎన్టీఆర్ ముద్దు పేరు.. అతని అభిమానులంతా తారక్ అని, యంగ్ టైగర్ అని ముద్దుగా పిలిచుకుంటారు. అదేవిధంగా తారక్ అని కూడా పిలుస్తారు. చిత్ర పరిశ్రమలో ఉన్న సినీ ప్రముఖులు డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ తారక్ అంటూ పిలుస్తారు. అయితే ఎన్టీఆర్‌ను తన ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుందాం. గతంలో జెమినీ టీవీలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రమోషన్ లో పాల్గొన్న యంగ్ టైగర్.. తనను ఇంట్లో ఒక్కొకరు ఒక్కో పేరుతో పిలుస్తుంటారని చెప్పుకొచ్చాడు.

తనకు ప్రత్యేకంగా ఓ పేరు లేదని అన్నారు. అప్పుడు తారక్ మాట్లాడుతూ.. ఇంట్లో మా అమ్మగారు ఓ పేరు పెట్టి పిలుస్తుంది అలాగే.. నా భార్య కూడా ఇంకో పేరు పెట్టి పిలుస్తుంది.. పిల్లలు నాన్న అని పిలుస్తారు.. అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అన్న.. తారక్ అన్నా.. రామారావు అన్న అని అన్నా పలుకుతాను.. నన్ను ప్రేమగా ఎలా పిలిచినా పలుకుతాను.. ఇదేవిధంగా పిలవండి అని మాత్రం నేను చెప్పను అని ఆయన చెప్పుకొచ్చాడు.