టీడీపీకి ఇంచార్జ్‌లు లేరు..బాబు కష్టమే..!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది…గట్టి చూసుకుంటే మరో ఏడాదిలో ఎన్నికల హడావిడి మొదలైపోతుంది..ఇంకా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్తితి ప్రతిపక్ష టీడీపీది. ఎలాగో వైసీపీ అధికార బలంతో కనిపిస్తోంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేయాలని చూస్తుంది. ఇక వైసీపీకి అడ్డుకట్ట వేయడం అనేది టీడీపీకి కష్టమైన పని. చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. అయితే వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టేందుకు చంద్రబాబు బాగానే కష్టపడుతున్నారు. చాలావరకు పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు.

అసలు 2019 ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీలో చాలామంది నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ బాబు పోరాటం, ఎక్కడకక్కడ కార్యకర్తలకు అండగా ఉండటం..మళ్ళీ నాయకులు లైన్ లో పడ్డారు. నియోజకవర్గాల్లో యాక్టివ్ గా పనిచేస్తూ వస్తున్నారు. కొన్ని స్థానాల్లో కొత్త ఇంచార్జ్ లని తీసుకొచ్చి పెట్టారు. అయితే ఇంకా కొన్ని స్థానాల్లో టీడీపీకి ఇంచార్జ్‌లు కనిపించడం లేదు. 175 స్థానాలు ఉంటే 140 స్థానాల్లో మాత్రమే ఇంచార్జ్‌లు ఉన్నారని తేలింది. దాదాపు 35 స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు.

ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేస్తున్నారు. 35 స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు..కానీ గెలిచేస్తాం..అధికారంలోకి వచ్చేస్తామని బాబు ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే సాయిరెడ్డి చెప్పింది వాస్తవమే..సరిగ్గా ఇంచార్జ్‌లు లేకుండా ముందుకెళ్లడం కష్టమైన పని. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పూతలపట్టు స్థానాల్లో టీడీపీకి ఇంచార్జ్‌లు లేరు. మూడున్నర ఏళ్ళు అవుతున్నా సరే బాబు తన సొంత జిల్లాలో కూడా ఇంచార్జ్‌లని పెట్టలేకపోయారు.

ఇటు పశ్చిమ గోదావరిలో చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, నిడదవోలు స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు. అంటే టీడీపీకి ఏ పరిస్తితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది సీటు కోసం పోటీ పడటంతో బాబు ఇంచార్జ్ పదవులని తేల్చడం లేదు. అలా అని ఖాళీగా ఉంచడం వల్ల టీడీపీకే నష్టం. కాబట్టి బాబు త్వరగా ఆ స్థానాలని తేల్చేస్తే బెటర్.