అక్కడ రష్మికకు గట్టి షాక్ తగిలిందిగా..?

సౌత్ ఇండస్ట్రీలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ క్రేజ్ తోని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి రష్మిక పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటోంది. కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో బాగా రాణించడంతో బాలీవుడ్లో అవకాశాలు రాగానే అక్కడికి వెళ్ళిపోయింది.

Rashmika Mandanna responds to trolls who mocked her for not watching  Kantara | Bollywood - Hindustan Timesబాలీవుడ్ లో ఒకేసారి రెండు చిత్రాలలో నటించే అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ .మొదట అమితాబచ్చన్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటించిన రష్మిక ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఇక సిద్ధార్థ మల్హోత్రా తో చేసిన మిషన్ మజ్ను సినిమా కూడా బాలీవుడ్ లో బాగానే సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటి లో విడుదలవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం ఓటీటి లో విడుదలైన రష్మికకు పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే రష్మిక బాలీవుడ్ లో చేసిన మొదటి రెండు సినిమాలు నిరాశ మిగిల్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల విషయాలను పక్కన పెడితే రష్మిక సందీప్ వంగ డైరెక్షన్లో చేస్తున్న యానిమల్ సినిమా పైన హోప్స్ పెట్టుకుంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక రిలీజ్ విషయంలో మాత్రం ఇలాంటి షాక్ లు తప్పడంతో రాబోయే రోజుల్లో ఇమే క్రేజ్ తగ్గిపోయే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి