KRK ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి మీద వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టాప్ సెలబ్రిటీల హృదయాలను గాయపరిచి మరి శత్రువుగా మారారు. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్, అమీర్ ప్రభాస్ ,రిషబ్ శెట్టి ఇలా ఎంతోమంది స్టార్స్ పైన పలు క్రిటిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పైన ఆమె భర్త పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. షోయబ్ మాజీ భార్య అమేషా సిద్ధిఖీ నుండి షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుని సానియా మీర్జాన వివాహం రహస్యంగా చేసుకున్నారని.. ఈ జంట బ్రేకప్ వార్తలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు క్రిటిక్ కె ఆర్ కె.
KRK మాట్లాడుతూ.. షోయబ్ మాలిక్ మొదటి భార్య నుండి విడిపోవడానికి సానియా మీర్జా నే ఒక కారణమని ఆ ఇంటిని ఈమె సర్వనాశనం చేసిందని కేఆర్కే ఆరోపించారు. ఇక సానియా మీర్జా కూడా తన చిన్ననాటి స్నేహితుడితో బ్రేకప్ అయిపోయాక షోయబ్ తో ఇమే వివాహానికి సిద్ధమైందనే విధంగా వార్తలు వినిపించాయి.krk ఒక వీడియోని హిందీలో విడుదల చేస్తూ అందులో పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసినట్లు తెలుస్తోంది.
ఆమేషా నుండి విడాకులు తీసుకోవాలని సానియా మీర్జా నేరుగా షోయబ్ కు తెలియజేయడంతో ఆకారణంగా వివాహానికి మూడు రోజుల ముందు అతడు విడాకులు తీసుకున్నారని KRK తెలియజేస్తున్నారు. మరి ఈ వీడియో పైన సానియా మీర్జా దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పుడు కూడా షారుఖ్ ఖాన్ నటిస్తున్న పటాన్ చిత్రం పైన పలు వాక్యాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.