రవితేజ నటించిన ధమాకా చిత్రం పైన రవితేజ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయక ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈసారి కూడా రవితేజ ఒక మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ గా బరిలోకి దిగబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకి కనిపిస్తోంది. రెండు విభిన్నమైన పాత్రలలో రవితేజ నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథాంశంతో ఎంత అద్భుతంగా తెలకెక్కించినట్లుగా కనిపిస్తోంది.
ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఒకరు క్లాస్ మరొకరు మాస్ అన్నట్లుగా విభిన్నమైన పాత్రలలో చూపించబోతున్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. శ్రీ లీల అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక డైలాగులు కూడా రవితేజ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాలోని చెప్పే ప్రతి డైలాగు కూడా అభిమానులను మెప్పించేలాగా కనిపిస్తోందని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.. తనికెళ్ల భరణి, జైశ్రీరామ్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ధమాకా చిత్రంలో రవితేజ తో రొమాన్స్ తో బాగా అదరగొట్టేసినట్టుగా శ్రీ లీల కనిపిస్తోంది.
ధమాకా చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతోంది. ఇక రవితేజ నటించిన గత చిత్రాలు అన్నీ కూడా వరుస డిజాస్టర్లు కావడంతో రవితేజ కెరియర్ మొత్తం ఈ సినిమా పైన ఆధారపడిందని చెప్పవచ్చు. మరి ఏమెరకు రవితేజ ఈ సినిమాతో అభిమానులను మెప్పిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ట్రైలర్ మాత్రం వైరల్ గా మారుతోంది