పవన్ కళ్యాణ్ సినిమాలో మంచు లక్ష్మి… వద్దుబాబోయ్ వద్దంటున్న మెగా ఫాన్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదని అనడంలో అతిశయోక్తి ఏముంటుంది చెప్పండి. ఇక ఆయన నుండి సినిమా వస్తోందంటే పూనకాలు రావడం ఖాయం. హిట్టు, ప్లాపులతో తేడాలేకుండా దూసుకుపోతున్న ఏకైన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ ఎన్నికలు దగ్గర పడటంతో వరుస సినిమాలు పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను ప్రకటించాడు. తాజాగా సుజిత్ దర్శకత్వంలో ఓ అదిరిపోయే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి విదితమే.

ఇక అసలు విషయానికొస్తే మంచు లక్ష్మి గురించి కూడా పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మంచు ఫామిలీ నుండి వచ్చిన ఫైనెస్ట్ యాక్ట్రెస్ ఆమె. మొదట సినిమా ‘అనగనగా ధీరుడు’తోనే సత్తా చాటిన లక్ష్మి అనతికాలంలోనే తనదైన మార్క్ క్రియేట్ చేసింది. ఇక ‘గుండెల్లో గోదారి’ సినిమాతో ఏకంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… పవన్ నుండి రాబోతున్న ఓ సినిమాలో మంచు లక్ష్మి ఓ నెగిటివ్ రోల్ చేయబోతోందని వినికిడి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు గాని, మెగా ఫాన్స్ మాత్రం ఈ విషయం తెలిసిననుండి… కాస్త మనస్తాపానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. అయితే దానికి కారణం లేకపోలేదు. మంచు లక్ష్మి నటించిన సినిమాలు దాదాపుగా ఫెయిల్ అయ్యాయి. అందుకే సెంటిమెంటల్ గా పవన్ సినిమా కూడా ఎక్కడ తేడా కొడుతుందేమోనని ఫాన్స్ కంగారు పడుతున్నారు. అయితే దీనిపైన ఎంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.