సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు . ఏ హీరో పొజిషన్ శాశ్వతం కాదు . దాన్నే మరోసారి ప్రూవ్ చేశాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. కృష్ణంరాజు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ ..మొదటి సినిమా ఈశ్వర్ లో ఎంత అమాయకంగా క్యూట్ గా కనిపించాడు మనకి తెలిసిందే. ఇప్పటికి ఈశ్వర్ సినిమాను చూసి ఆ తర్వాత బాహుబలి సినిమాను చూస్తే.. ఏంటి ఈశ్వర్ లో ఉండే ప్రభాసేన బాహుబలి లో అమరేంద్ర బాహుబలి గా చేసిన ప్రభాస్ అని ఆశ్చర్యపోక తప్పదు . అలాంటి స్థానాన్ని అభిమానుల మనసులో దక్కించుకున్నాడు. ప్రతి సినిమాకు తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ హిట్లు ప్లాపులను తేడా లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రెబల్ హీరో .
కాగా రీసెంట్గా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన వీడియో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో అందరికీ తెలిసిందే. ఒకటిన్నర నిమిషం కూడా లేని ఈ గ్లింప్సే సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే.. రేపటి రోజున రిలీజ్ అయ్యే ప్రోమో ..ఆ తరువాత స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్ ఏ రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తుందో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయో అంటూ రెబల్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
కసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోక లేని వార్తలు ఎన్నో వైరల్ గా మారుతున్నాయి . దానికి సంబంధించిన ప్రశ్నలు సైతం బాలకృష్ణ తన షోకి గెస్ట్ గా వచ్చే వారిని ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోనే ప్రభాస్ గతంలో ఓ స్టార్ హీరోయిన్ ని మగరాయుడు అంటూ కామెంట్ చేశాడని వార్తలు వినిపించాయి. ఇదే ప్రశ్న నందమూరి బాలకృష్ణ షోలో ప్రభాస్ ని అడిగినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ప్రభాస్ తనపై వస్తున్న పుకార్లపై అలాగే తనకు అనుష్కకు పెళ్లి అంటూ వస్తున్న వార్తలు పై స్పందించినట్లు తెలుస్తోంది . అంతేకాదు ఆ మగరాయుడు హీరోయిన్ చూస్తే తనకు మూడు రాదని కూడా గతంలో ప్రభాస్ కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . తన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నుండి ఆ హీరోయిన్ ని తప్పించినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా సరే ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితే ప్రభాస్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవచ్చు రెబల్ ఫ్యాన్స్ అంటూ ఆశపడుతున్నారు జనాలు. చూడాలి మరి ప్రభాస్ నిజంగానే హీరోయిన్ అంత మాట అన్నాడా..? లేదా అదంతా కేవలం గాసిప్ రాయళ్ల కల్పితమా..? తెలియాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే..!